పున్నమిరాత్రి 30న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రద్ధాదాస్, మోనాల్ గజ్జర్, శ్వేతబసు ప్రసాద్ కీలక పాత్రల్లో నటించిన సినిమా పున్నమి రాత్రి. కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్త నిర్మిస్తోంది. వినయన్ దర్శకుడు. ఎం.సుబ్బారెడ్డి నిర్మాత. ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 30న విడుదల చేయనున్నారు. తొలి సారి త్రీడీలో వస్తున్న హారర్ సినిమా ఇది. తప్పకుండా అందరినీ అలరించే డ్రాకులా సినిమా అవుతుంది అని శోభారాణి తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ ``ఆడు మగాడ్రా బుజ్జి సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంటర్ అయ్యాం. పున్నమి రాత్రి మా సంస్థలో రెండో సినిమా. త్రీడీతో పాటు టూడీలోనూ ఈ సినిమాను చేశాం. ఈ నెల 30న సినిమాను విడుదల చేస్తాం`` అని చెప్పారు. సహ నిర్మాత సిరాజ్ మాట్లాడుతూ ``త్రీడీ థియేటర్ల కోసం ఎదురుచూశాం. రుద్రమదేవి చిత్రంతో 150 త్రీడీ థియేటర్లు వచ్చాయి. అక్టోబర్ 30న విడుదల చేస్తాం`` అని అన్నారు.
మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు రఘురామ్ చెప్పారు. ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్; రాజీవ్ రామా, కెమెరా: సతీష్ బాబు, సంగీతం; భబిత్ జార్జ్, రఘురామ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com