TDP:'అంతా 'సర్' చూసుకుంటారు.. అడ్డొస్తే పోలీసులనైనా ఏసేద్దాం ’' : పుంగనూరు కుట్రపై చల్లా బాబు డ్రైవర్ వాంగ్మూలం

  • IndiaGlitz, [Thursday,August 17 2023]

తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఫ్రస్ట్రేషనో లేక , పంతం నెగ్గించుకోవాలనుకున్న తాపత్రయమో కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల పుంగనూరు, అంగళ్లులో చేయించిన హింసాకాండ జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది. తమను పోలీసులు, వైసీపీ నేతలు పుంగనూరులోకి వెళ్లకుండా అడ్డుకున్నారని.. ఉద్దేశపూర్వకంగా దాడికి తెగబడ్డారంటూ చంద్రబాబు రంకెలు వేశారు. కానీ వాస్తవంలో జరిగింది వేరని వైసీపీ నేతలు, పోలీసులు చెబుతున్నారు. కావాలని పనిగట్టుకుని చంద్రబాబు దాడి చేయించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

పోలీసులకు నరీన్ కుమార్ వాంగ్మూలం:

నిజాన్ని ఎవరూ కప్పిపుచ్చలేరని పెద్దలు అంటూ వుంటారు. ఈరోజు కాకపోయినా రేపైనా నిజం బద్ధలు కావాల్సిందే. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలోనూ వాస్తవం వెలుగుచూసింది. దాడి ఎవరు చేయించారు, ఎవరు చేశారు అనే నిజాలు వాస్తవ రూపం దాల్చాయి. పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు కార్ డ్రైవర్ గా పని చేస్తున్న కలకడ నరీన్ కుమార్ పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఆయన చెప్పిన దిగ్భ్రాంతికర విషయాలు విని పోలీసులే ఖంగుతిన్నారంటే అతిశయోక్తి కాదు.

చంద్రబాబు కాన్వాయ్ పుంగనూరులోకి వెళ్లాల్సిందేనంటూ ఫోన్ :

తమ పార్టీ నాయకులు, తన యజమాని చల్లా బాబు మాట్లాడిన ఫోన్ మాటలు, ఎవరితో ఏమేం మాట్లాడింది నరీన్ పూసగుచ్చినట్లు వివరించారు. ఇదిలా ఉండగా చల్లా బాబును పోలీసులు ఏ -1 గా చేర్చిన సంగతి తెలిసిందే. నరీన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఏమన్నారంటే ' ఆగస్టు ఒకటిన చల్లా బాబు , తాము రొంపిచర్ల నుంచి పుంగనూరు వస్తుండగా మా సార్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో అవతలి వ్యక్తి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుగారి కాన్వాయ్ పుంగనూరు బైపాస్ నుంచి పుంగనూరు టౌన్ లోపలికి వెళ్లాల్సిందే అని ఆదేశాలొచ్చాయి. దీనికి చల్లా బాబు ' ఒకే సార్.. అలాగే సార్ ' అన్నారని నరీన్ పేర్కొన్నారు.

కర్రలు, రాడ్లతో బాబు యాత్రలోకి :

ఆ తరువాత చల్లా బాబు పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి బీర్ సీసాలు, కర్రలు , రాడ్లు తీసుకుని చంద్రబాబు యాత్రలో పాల్గొనాలని, అయన యాత్ర పుంగనూరులోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే అవసరమైతే వాళ్ళను చంపేసి అయినా చంద్రబాబును పుంగనూరు టౌన్ లోపలికి తీసుకుపోయేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ పథకం అమలు చేసే విషయాన్ని చర్చించేందుకు, అన్నీ సిద్ధం చేసుకునేందుకు చల్లా బాబు స్వగ్రామం అయిన గర్ణిమిట్టవా వారిపల్లెలోని అయన స్వగృహానికి రావాలని టీడీపీ కార్యకర్తలకు సమాచారం అందించామని నరీన్ కుమార్ పోలీసులకు వివరించారు. దీనికి కొందరు భయపడ్డారని.. పోలీసు కేసులు అయితే ఎలా అని తాను కూడా ఆందోళన చెందగా అన్నీ 'సార్ ' చూసుకుంటారు అని తన బాస్ చల్లా బాబు తనకు అభయం ఇచ్చినట్లు నరీన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించారు.

ఈ వాంగ్మూలానికి ఏం సమాధానం చెబుతారు :

పుంగనూరు, అంగళ్లు విధ్వంసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి , పోలీసులకు, వైసీపీ నేతలకు నరీన్ వాంగ్మూలం ఒక ఆయుధంగా చెప్పుకోవచ్చు. తమకు సంబంధం లేదని, అంతా వైసీపీ నేతలే చేశారంటున్న తెలుగు తమ్ముళ్లు మరి దీనికి ఏమని సమాధానం చెబుతారో. లేదంటే తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి నరీన్‌ను భయపెట్టి పోలీసులే తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని అన్నా అంటారు టీడీపీ నేతలు. నరం లేని నాలుక ఎన్ని రకాలుగైనా మాట్లాడుతుంది. ఇప్పుడు నరీన్ తన నేరాన్ని అంగీకరించినట్లుగా , రేపు మరొకరు నిజం చెప్పకపోరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న సంగతిని టీడీపీ నేతలు మరిచిపోకూడదు. అసలు ఏం జరిగింది అనేది అంగళ్లు, పుంగనూరు ప్రజలకు తెలియకుండా వుంటుందా..?

More News

Vision 2020:విజన్ 2020లో జరిగింది ఇదే.. అప్పుడు ధ్వంసం బ్యాలెన్స్, 2047తో సంపూర్ణ విధ్వంసమే

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడానికి ముందుంటారు.

YSRCP:టైమ్స్ నౌ సర్వే: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే .. ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ .. బాబు , పవన్ గాలి నామమాత్రమే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.

Chandrababu Naidu:చంద్రబాబును నమ్మని జనం.. విశాఖ సభకు స్పందన కరువు, ఖాళీ కుర్చీలకు ‘విజన్’ చెప్పారా..?

గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి తేరుకునేందుకు టీడీపీ కిందా మీద పడుతున్న సంగతి తెలిసిందే.

Chandrababu Naidu:బాబు గారి కామెడీ : ఇంజినీరింగ్ చదవాలంటే బైపీసీ చేయాలట ... హైటెక్ సీఎం, విజనరీ లీడర్ నాలెడ్జ్ ఇది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు వేదికల మీదకు వెళ్లినా తరచుగా ఓ మాట చెబుతూ వుంటారు.

Vangaveeti Radha Krishna:మనసు మార్చుకున్న వంగవీటి రాధా.. త్వరలో పెళ్లిపీటలెక్కనున్న రంగా వారసుడు, అమ్మాయి ఎవరంటే..?

దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పెళ్లి పీటలెక్కనున్నారు.