రాహుల్‌తో ఉన్న రిలేషన్ గురించి నోరు విప్పిన పునర్నవి
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 3లో ఆసక్తిరేపిన అంశాల్లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం మధ్య ఏదో ఉందనే అంశం కూడా ఒకటి. ఇద్దరూ చాలా క్లోజ్‌గా మెలిగారు. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని అందరూ అనుకునేలా ఇద్దరి మధ్య ప్రవర్తన ఉండింది. ఓ దశలో పునర్నవిని ఎలిమినేషన్ నామినేషన్స్ నుండి తప్పించడానికి రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ రసాన్ని తాగాడు.
అలాగే మరో సందర్భంలో రాహుల్ ఫేక్ ఎలిమినేట్ అయితే .. పునర్నవి కన్నీళ్లు పెట్టుకుంది. తిరిగి రాహుల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే పునర్నవి సంతోషం పట్టలేకపోయింది. అతన్ని గట్టిగా హత్తుకుంది కూడా. ఇదంతా గతం.. ఇప్పుడు పునర్నవి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేట్ అయిన పునర్నవిని చూసి రాహుల్ వెక్కి వెక్కి ఏడ్చాడు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని అందరూ బలంగా అనుకున్నారు.
బయటకు వచ్చిన పునర్నవి ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పారు. తనకు, రాహుల్‌కు మధ్య అందరూ అనుకుంటున్నట్లు ఏమీ లేదని, తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పింది. రాహుల్‌తో ఎంత స్నేహమైతే ఉందో వరుణ్ సందేశ్‌తో కూడ అంతే స్నేహం ఉందని కూడా చెప్పకనే చెప్పింది. బయటకు వచ్చిన తర్వాత రాహుల్ ప్రపోజ్ చేస్తే ఏమంటారు? అని అడిగితే.. వాడిని నోటికి వచ్చినట్లు తిడతానని చెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు రాహుల్‌ని తిడుతుండే తాను..ప్రపోజ్ చేస్తే కూడా అదంతా ఎందుకు? అనే తిడతాను అంటూ ఇద్దరి మధ్య స్నేహం తప్ప ఏదీ లేదంటూ ఓ క్లారిటీ ఇచ్చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments