అతనికి ఎస్ చెప్పానంటూ ఫోటో రివీల్ చేసిన పునర్నవి..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటి, బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం తనకు కాబోయే వ్యక్తికి సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తోంది. నిన్న చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన పున్ను ‘ఎట్టకేలకు ఇది జరుగుతోంది’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇవాళ ఇన్‌స్టా వేదికగా మరో ఆసక్తికర ఫోటోను పున్ను షేర్ చేసింది. ఉద్భవ్ రఘునందన్ అనే వ్యక్తిని ట్యాగ్ చేస్తూ ‘అతనికి ఎస్ చెప్పాను’ అనే క్యాప్షన్ ఇచ్చింది. అంతే కాదు తన జీవితంలో ఒక గొప్ప రోజు గురించి శుక్రవారం చెబుతానని తెలిపింది.
మరోవైపు రఘునందన్ కూడా తన ఇన్‌స్టాలో పున్నుతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ‘ఆమె నాకు ఎస్ చెప్పింది. రేపు మీకొక విషయం చెబుతాను’ అని వెల్లడించారు. రఘునందరన్ కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. ఆయన నటుడిగానూ.. రచయితగానూ కొనసాగుతున్నారు. పలు వెబ్ సిరీస్‌లో నటించారు. అసలు పున్ను ఈ వరుస అప్‌డేట్స్‌ను ఎందుకిస్తోందనేదే ఆసక్తికరంగా మారింది.
మొదట ఎంగేజ్‌మెంట్ రింగ్.. క్యాప్షన్. తరువాత రఘునందర్ ఫోటోతో క్యాప్షన్.. శుక్రవారం మరేదో చెబుతాననడం.. ఇదంతా నిజంగా తన వివాహానికి సంబంధించిన విషయాలను పున్ను వెల్లడిస్తోందా? లేదంటే ఏదైనా సినిమా లేదంటే వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా చేస్తోందా? అనే అనుమానాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా శుక్రవారం అన్ని ప్రశ్నలకూ జవాబులు లభించనున్నాయి. ఇక రేపు పున్ను ఏం చెప్పబోతోందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com