‘టిక్‌టాక్’ తర్వాత పబ్జీ పై నిషేధం..!
Send us your feedback to audioarticles@vaarta.com
'టిక్‌టాక్' యాప్‌పై విధించిన నిషేధం కొనసాగుతుందని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ యాప్ సంబంధీకులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. కాగా టిక్‌టాక్ తర్వాత పాపులర్ మొబైల్ గేమ్ ప్లేయర్ అన్నౌన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్ పబ్జీని నిషేధించాలని ప్రజలు, ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవంగా ముందునుంచే ఈ గేమ్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. టిక్‌టాక్ పై ఆంక్షలతో పబ్జీని కూడా నిషేధించాలని డిమాండ్ పెరిగింది. కొరియా కంపెనీ తయారుచేసిన ఈ ఆటకు అనేకమంది బానిసలవుతుండగా.. కొందరు ఉద్వేగానికి, ఉద్రేకానికి లోనై అవాంఛిత ఘటనలు సందర్భాలు కోకొల్లలు. ఇప్పటికే అనేక మంది పబ్ జీ ఆడి మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజాగా... తెలంగాణకు చెందిన మరో యువకుడు పబ్ జీ గేమ్‌కు బానిసై ప్రాణాలను తీసుకున్నాడు. నిజామాబాద్ లో 9వ తరగతి చదువుతున్న శ్రేయస్ అనే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి పబ్ జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించడంతో కోపంగా గదిలోకి వెళ్లిన శ్రేయస్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. కాగా ఈ ఆటను దేశంలో పలుచోట్ల స్థానిక ప్రభుత్వాలు నిషేధించాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout