కేంద్రం కీలక నిర్ణయం.. పబ్జీ సహా 118 యాప్‌లపై నిషేధం..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు మరోసారి భారత్ షాక్ ఇచ్చింది. గల్వాన్ లోయ వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టిక్‌టాక్ సహా 59 యాప్‌లపై కేంద్ర నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో 49 యాప్‌లపై నిషేధం విధించింది. తాజాగా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆన్‌లైన్ గేమింగ్ యాప్ పబ్జీతో పాటు మరో 118 చైనా మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించింది.

ఈ మేరకు భారత సమాచార సాంకేతిక శాఖ నిర్ణయం తీసుకుంది. తాజా చర్యతో భారత్ నిషేధించిన చైనీస్ మొబైల్ యాప్‌ల సంఖ్య 224కు చేరింది. పబ్జీపై నిషేధం విధించినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించడంతో.. భారత్‌లో ఈ గేమింగ్ యాప్‌ను అందుబాటులో లేకుండా గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. అయితే ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫ్లాట్‌ఫాంలపై లభించే కొన్ని యాప్స్ వ్యక్తుల సమాచారాన్ని సేకరించి దేశం వెలుపల ఉన్న సర్వర్లకు సీక్రెట్‌గా అందిస్తున్నట్టు అందిన ఫిర్యాదు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. పబ్జీ యాప్‌ను ప్రస్తుతం మన దేశంలో దాదాపు 50 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు.

More News

ప‌వ‌న్ 28...డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేసిన హ‌రీశ్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రెండో చిత్రం ప్రారంభం కానుంది.

‘ఆచార్య’ సినిమా క‌మిటీపై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోనున్న రాజేశ్‌

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తు్నారు.

‘వి’ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా జ‌స్టిఫికేష‌న్ ఉన్న పాత్ర చేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది : సుధీర్‌బాబు

హీరోగా, నిర్మాత‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నారు సుదీర్ బాబు. ‘స‌మ్మోహ‌నం’ త‌ర్వాత ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో

చిత్తూరు మృతుల కుటుంబాలకు ఎవరెవరు ఆర్థిక సాయం ప్రకటించారంటే..

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం దగ్గర పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా

చిత్తూరు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన రామ్ చరణ్

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం దగ్గర పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కడుతూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే.