కేంద్రం కీలక నిర్ణయం.. పబ్జీ సహా 118 యాప్‌లపై నిషేధం..
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు మరోసారి భారత్ షాక్ ఇచ్చింది. గల్వాన్ లోయ వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టిక్‌టాక్ సహా 59 యాప్‌లపై కేంద్ర నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో 49 యాప్‌లపై నిషేధం విధించింది. తాజాగా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆన్లైన్ గేమింగ్ యాప్ పబ్జీతో పాటు మరో 118 చైనా మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించింది.
ఈ మేరకు భారత సమాచార సాంకేతిక శాఖ నిర్ణయం తీసుకుంది. తాజా చర్యతో భారత్ నిషేధించిన చైనీస్ మొబైల్ యాప్‌ల సంఖ్య 224కు చేరింది. పబ్జీపై నిషేధం విధించినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించడంతో.. భారత్‌లో ఈ గేమింగ్ యాప్‌ను అందుబాటులో లేకుండా గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. అయితే ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫ్లాట్‌ఫాంలపై లభించే కొన్ని యాప్స్ వ్యక్తుల సమాచారాన్ని సేకరించి దేశం వెలుపల ఉన్న సర్వర్లకు సీక్రెట్‌గా అందిస్తున్నట్టు అందిన ఫిర్యాదు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. పబ్జీ యాప్‌ను ప్రస్తుతం మన దేశంలో దాదాపు 50 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com