బీజేపీలోకి పీటీ ఉష?
Send us your feedback to audioarticles@vaarta.com
పరుగుల రాణి పీటీ ఉష రాజకీయాల్లోకి రాబోతున్నారా? కమలదళంలో చేరబోతున్నారా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే బీజేపీ ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు వ్యూహ రచన చేస్తోందని సమాచారం. అందుకే ఇప్పటికే సినీ సెలబ్రిటీలను.. అలాగే ప్రముఖ క్రీడాకారులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఈ దిశలోనే అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పటికే బీజేపీ కేరళపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కేరళలో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను ఆకర్షించింది. శ్రీధరన్‌కు మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుంది. అయితే 2017లో లక్నో మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీధరన్‌ను పట్టించుకోలేదని అప్పట్లో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన సలహాలు సూచనలతోనే లక్నో మెట్రో ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయింది. ఐతే ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదికపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధరన్ ఓ మూలన నిల్చున్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
అలాంటి శ్రీధరన్ ప్రస్తుతం బీజేపీలో చేరబోతున్నారన్న వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాగే ప్రస్తుతం పరుగుల రాణి పీటీ ఉష కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో పీటీ ఉష బీజేపీకి అనుకూలంగా తన గళం వినిపించారు. దీనిపై పీటీ ఉష అయితే ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే పీటీ ఉషతో పాటు పలువురు ప్రముఖులు సైతం బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com