సెప్టెంబర్ 25న విడుదలవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'ది ఐస్'
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్ గోపాల్ వర్మ 365 డేస్` చిత్రాన్ని నిర్మించిన యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ డి.వి.వెంకటేష్ నిర్మాతగా డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై మీరాజాస్మిన్ ప్రధానపాత్రలో నటించిన మలయాళ చిత్రాన్నిది ఐస్` అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అదే పేరుతో అందిస్తున్నారు. ఈ చిత్రానికి షాజియం దర్శకుడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలవుతుంది. ఈ సందర్భంగా....
చిత్ర నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ `పందెంకోడి, గుడుంబా శంకర్, అమ్మాయి బాగుంది వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ పెళ్లికి ముందు నటించిన మలయాళ చిత్రమిది. అంధురాలిగా ఉన్న యువతికి కంటిచూపు వస్తుంది. కానీ ఆమెకి అప్పటి నుండి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. అవేంటో సినిమాలో చూడాల్సిందే. సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా మంచి కలెక్షన్స్ ను సాధించింది.
నేను మలయాళంలో ఈ చిత్రాన్ని చూడగానే నాకు బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందనిపించింది, అందుకే ఈ చిత్ర రైట్స్ ను కొని తెలుగులో ది ఐస్ పేరుతో విడుదల చేస్తున్నాను. అంతే కాకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క సహాయంతో రీరికార్డింగ్ ను కొత్తగా చేయించాను. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్‌ను పొందింది. ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు ఫైనల్ డెస్టినేషన్ తరహా కాన్సెప్ట్‌తో మూవీ, సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25నల విడుదల చేస్తున్నాం.
షాజియం ఒక మంచి పాయింట్ తో ఇంతకు ముందు చెప్పిన విధంగా హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సినిమాని తెరకెక్కించారు. మీరా జాస్మిన్ నటన హైలైట్ గా నిలుస్తుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. అలాగే మా బ్యానర్ లో వంశీగారి దర్శకత్వంలో రూపొందిన వెన్నల్లో హాయ్ హాయ్`చిత్రాన్ని కూడా త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments