ఆగస్ట్ 3న సైకలాజికల్ థ్రిల్లర్ 'శివకాశీపురం'
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు, శ్రీ తనయుడు రాజేష్ శ్రీ చక్రవర్తిని హీరోగా పరిచయం చేస్తూ సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం 'శివకాశీపురం'. హరీష్ వట్టికూటి దర్శకత్వంలో మోహన్‌బాబు పులిమామిడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత మోహన్‌బాబు పులిమామిడి మాట్లాడుతూ ''దర్శకుడు, ఇతర అన్ని శాఖల సభ్యుల సహకారంతో ఒక మంచి చిత్రాన్ని నిర్మించాం. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని ఆగస్ట్ 3న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడని మేము విడుదల విషయంలో కూడా రాజీ పడడం లేదు. మంచి పబ్లిసిటీతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం'' అన్నారు.
దర్శకుడు హరీష్ వట్టికూటి మాట్లాడుతూ ''నాకిది తొలి చిత్రమైనా నిర్మాత అందించిన సహకారంతో అనుకున్న విధంగా క్వాలిటీ ఔట్‌పుట్ ఇవ్వగలిగాను. ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. విభిన్న కథాంశాలతో రూపొందిన చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. మంచిర్యాల, కాజీపేట, గాంధారి ఖిల్లాలలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్, పాటలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే ఎస్.పి.బాలు, యాజన్ నిజార్('శ్రీమంతుడు' ఫేం), హేమచంద్ర పాడిన పాటలు యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి'' అన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదలను పర్యవేక్షిస్తున్న వి.ఎస్.విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ ''నటుడు దిల్ రమేష్ సూచనతో 'శివకాశీపురం' చిత్రాన్ని చూడడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్న ఉద్దేశంతో ఈ చిత్రం విడుదల పర్యవేక్షణ బాధ్యతలను తీసుకున్నాను. సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రంగా 'శివకాశీపురం' నిలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది'' అన్నారు.
రాజేష్ శ్రీచక్రవర్తి, ప్రియాంక శర్మ, చమ్మక్ చంద్ర, దిల్ రమేష్, సూర్య, లక్ష్మీ, రవిఆనంద్, చిన్నిబిల్లి, సందీప్, రవీంద్ర నటరాజ్, సత్యప్రియ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: పవన్ శేషా, కెమెరా: జయ జి. రామిరెడ్డి, ఎడిటింగ్: జియో థామస్-టి.రాము, విడుదల పర్యవేక్షణ: విఎస్. విజయ్‌వర్మ పాకలపాటి, నిర్మాత: మోహన్‌బాబు పులిమామిడి, రచన, దర్శకత్వం: హరీష్ వట్టికూటి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments