'పిఎస్‌వి గ‌రుడవేగ 126.18ఎం' థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌

  • IndiaGlitz, [Monday,October 16 2017]

యాంగ్రీ యంగ్ మేన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో డా.రాజ‌శేఖ‌ర్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'. పూజా కుమార్‌, శ్ర‌ద్ధాదాస్‌, కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్వ‌క‌త్వంలో కోటేశ్వ‌ర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ అక్టోబ‌ర్ 17న నంద‌మూరి బాల‌కృష్ణ చేతుల మీదుగా విడుద‌ల కానుంది. అలాగే సినిమాను న‌వంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా....

చిత్ర నిర్మాత కోటేశ్వ‌ర్ రాజు మాట్లాడుతూ ..."తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు డా.రాజ‌శేఖ‌ర్ అన‌గానే మ‌గాడు, అంకుశం వంటి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్ గుర్తుకొస్తాయి. చాలా గ్యాప్ త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ పిఎస్‌వి గ‌రుడ‌వేగ‌లో మ‌రోసారి అలాంటి ప‌వ‌ర్‌ఫుల్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. దేశంలో పెట్రేగిపోతున్న తీవ్ర‌వాదాన్ని భార‌త‌దేశంలో ప‌సిగ‌ట్టి, వారి కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగ‌నీయ‌కుండా ప్ర‌జ‌ల‌ను కాపాడే సంస్థ ఎన్ఐఏ(నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ). ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ఎన్ఐఏ ఆఫ‌స‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. ప‌వ‌ర్‌పుల్ హీరోయిజం, హృద‌యాన్ని తాకే ఎమోష‌న్స్‌, ఉత్కంఠ‌త రేపే స‌న్నివేశాలతో సినిమాను ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించారు. మేకింగ్‌లో ఎక్క‌డా వెనుకంజ వేయ‌లేదు. పాతిక కోట్ల భారీ బ‌డ్జెట్‌తో సినిమాను హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో హాలీవుడ్ స్టాండ‌ర్స్‌తో తెర‌కెక్కించాం.

అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే స‌న్నిలియోన్ 'డియో డియో..' సాంగ్‌ను విడుద‌ల చేశాం. ఇప్పుడు ఆ సాంగ్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. భాస్క‌ర‌భ‌ట్ల‌గారు రాసిన సాంగ్‌ను విష్ణుదేవాగారు అద్భుత‌మైన కొరియోగ్ర‌ఫీతో రూపొందించారు. న‌వంబ‌ర్ 3న సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. అలాగే దీపావ‌ళి సంద‌ర్భంగా సినిమాను అక్టోబ‌ర్ 17న న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ చేతుల మీదుగా విడుద‌ల చేయబోతున్నాం. శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, భీమ్స్ మ్యూజిక్, అంజి, గికా చెలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ ర‌గుతు, శ్యామ్ సినిమాటోగ్ర‌ఫీ, నూంగ్‌, డేవిడ్ కుబువా, స‌తీష్‌, బాబీ అంగారా స్టంట్స్ సినిమాను నెక్ట్స్ రేంజ్ తీసుకెళ్లాయి. సినిమా ఎక్స్‌ట్రార్డిన‌రీగా వ‌చ్చింది. మా పిఎస్‌వి గరుడ‌వేగ‌లో స‌రికొత్త రాజ‌శేఖ‌ర్‌ను చూస్తారు" అన్నారు.

రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, ఆదిత్‌, కిషోర్‌, నాజ‌ర్‌, ఆద‌ర్శ్‌, శ‌త్రు, ర‌విరాజ్‌లు ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. శ్రీనివాస్ అవ‌స‌రాల కామెడి పాత్ర పోషిస్తున్నాడు. అలీ సైకాల‌జిస్ట్ పాత్ర‌లో, పృథ్వీ నింఫోమానియ‌క్ పేషెంట్‌గా, పోసాని కృష్ణ‌ముర‌ళి, షాయాజీ షిండే పొలిటిషియ‌న్స్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతంః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః భీమ్స్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, గికా చెలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ ర‌గుతు, శ్యామ్‌, ఎడిటింగ్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, స్టంట్స్ః నూంగ్‌, డేవిడ్ కుబువా, స‌తీష్‌, బాబీ అంగారా, నిర్మాత: కొటేశ్వ‌ర్ రాజు, ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌వీణ్ స‌త్తారు.