ఈ వారంలో 'పిఎస్ వి గరుడవేగ' టీజర్..!

  • IndiaGlitz, [Monday,September 18 2017]

ఉగ్రవాదం అంటే అభం-శుభం తెలియని జనాల్ని చంపడమే కాదు. యువతను పెదతోవ పట్టించడం, పదిమందితో కలిసి ప్రజల్ని భయపెట్టడం, పరాయి దేశాల నుంచి మాదక ద్రవ్యాలను తీసుకొచ్చి మన దేశంలో విక్రయించడం, మన దేశ సంపదను అక్కడికి తరలించడం వంటి కార్యకలాపాలన్నీ ఉగ్రవాదంలో భాగమే. అటువంటి అతీతశక్తుల్ని సమాజం నుంచి బహిష్కరించడమే 'ఎన్‌ఐఏ' (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ). ఇదే కథాంశంతో యాంగ్రీ యంగ్‌మెన్‌ రాజశేఖర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం'. నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.కోటేశ్వరరాజు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పోస్టర్ల రూపంలో రిలీజ్‌ చేసిన క్యారెక్టర్లకు చక్కని స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ వారంలో టీజర్‌ను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

దీని గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ''నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ' నేపథ్యంలో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. బలమైన కథ, పాత్రకు ప్రాణంపెట్టి పని చేసిన నటీనటులు, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో రూపొందించిన ఈ చిత్రానికి ఇంటర్‌నేషనల్‌ టెక్నీషియన్లు కూడా పనిచేశారు. సెట్స్‌, స్టంట్‌, యాక్షన్‌ ఎలిమెంట్‌ దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. కీలకమైన యాక్షన్‌ ఎపిసోడ్ల కోసం హెవీ క్రేన్స్‌, ఇండస్ట్రీయల్‌ ట్రక్స్‌ ఉపయోగించాం. వృత్తినీ, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ కనిపించే వ్యక్తిగా రాజశేఖర్‌, ఆయన భార్యగా పూజాకుమార్‌ పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. జర్నలిస్ట్‌గా శ్రద్ధాదాస్‌, ప్రత్యేకగీతంలో సన్నీలియోన్‌, ఇప్పటివరకు చెయ్యని పాత్రలో పృథ్వీ, రాజకీయ నాయకులుగా పోసాని, షాయాజీ షిండే, ఇతర కీలక పాత్రల్లో రవివర్మ, శత్రు, చరణ్‌దీప్‌, ఆదర్స్‌ ఆకట్టుకుంటారు. ప్రీ రిలీజ్‌ కార్యక్రమాలకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ వారంలో టీజర్‌ని విడుదల చేస్తాం. అదే రోజు సినిమా విడుదల తేదీని వెల్లడిస్తాం'' అని తెలిపారు.

కిషోర్, నాజ‌ర్‌, శ్ర‌ద్ధాదాస్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, శ‌త్రు, సంజ‌య్ స్వ‌రూప్‌, ర‌వివ‌ర్మ‌, ఆద‌ర్శ్‌, చ‌ర‌ణ్ దీప్‌, ర‌వి రాజ్ త‌ది త‌రులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేక‌ప్ః ప్ర‌శాంత్‌, ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్స్ః శ్రీనివాస‌రావు ప‌లాటి, సాయి శివ‌న్ జంప‌న‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః ముర‌ళి శ్రీనివాస్‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ః బాబీ అంగార‌, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ సూప‌ర్ వైజ‌న్ః సి.వి.రావ్‌(అన్న‌పూర్ణ స్టూడియోస్‌), స్టంట్స్ః స‌తీష్‌, నుంగ్‌, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫ‌ర్ః విష్ణుదేవా, ఎడిట‌ర్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ర‌చ‌నః ప్ర‌వీణ్ స‌త్తారు, నిరంజ‌న్ రామిరెడ్డి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, స‌మ‌ర్ప‌ణః శివాని శివాత్మిక ఫిలింస్‌, నిర్మాణంః జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్ర‌ఫీః అంజి, సురేష్ ర‌గుతు, శ్యామ్ ప్ర‌సాద్‌, గికా, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ప్రొడ్యూస‌ర్ః ఎం.కోటేశ్వ‌ర్ రాజు, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.