జార్జియాలో 'పి ఎస్ వి గరుడవేగ 126.18ఎం' 33 రోజుల భారీ షెడ్యూల్
- IndiaGlitz, [Friday,June 09 2017]
'పిఎస్‌వి గరుడ వేగ 126.18 ఎం' చిత్రంలో డా.రాజశేఖర్ హీరోగా, ఆయన భార్యగా పూజా కుమార్ నటిస్తున్నారు. 'చందమామ కథలు', 'గుంటూరు టాకీస్' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం'. ఈ చిత్రాన్ని పలు అరుదైన లొకేషన్లలో రూపొందిస్తున్నారు. అందులో కీలకమైనది జార్జియా. అక్కడ 33 రోజులు చిత్రీకరణ జరిగింది. భారతీయ చిత్రాల్లో ఇప్పటివరకు వెండితెరపై కనిపించని లొకేషన్లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించడానికి దర్శకుడు నిర్ణయించారు.
ఆ మేరకు యురాషియన్ కంట్రీస్‌లో దాదాపు 40 రోజులు చిత్రీకరించారు. స్క్రిప్ట్ డిమాండ్‌ని బట్టి వాతావరణాన్ని పట్టించుకోకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులు అక్కడికి వెళ్లి పనిచేశారు. ''ఇక్కడి అధికారులు పర్మిషన్స్ ను ఇప్పటించడంలో చాలా సపోర్ట్ చేస్తున్నారు. సెన్సిటివ్ ఏరియాల్లో కూడా షూటింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. స్టంట్ టీమ్ ప్రతిభను గురించి ఎంత చెప్పినా తక్కువే'' అని దర్శకుడు అన్నారు.
రాజశేఖర్ మాట్లాడుతూ ''మేం పనిచేసిన లొకేషన్లకు 100 కిలోమీటర్ల పరిధిలో హోటళ్లు కూడా లేవు. అయినా టీమ్ మొత్తం క్యాంపుల్లోనే ఉన్నాం'' అని అన్నారు. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయం రూ.25కోట్లతో తెరకెక్కుతున్న చిత్రమిదే. అందులోనూ జార్జియా షెడ్యూల్ అత్యంత ఖరీదైనది.
డా.రాజశేఖర్, అదితి, పూజా కుమార్, శ్రద్ధా దాస్, కిషోర్, నాజర్, పోసాని కృష్ణమురళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, శత్రు, సంజయ్ స్వరూప్, రవివర్మ, ఆదర్శ్, చరణ్ దీప్, రవి రాజ్ తది తరులు నటిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేకప్ః ప్రశాంత్, ప్రొడక్షన్ మేనేజర్స్ః శ్రీనివాసరావు పలాటి, సాయి శివన్ జంపన, లైన్ ప్రొడ్యూసర్ః మురళి శ్రీనివాస్, కాస్ట్యూమ్స్ డిజైనర్ః బాబీ అంగార, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజన్ః సి.వి.రావ్(అన్నపూర్ణ స్టూడియోస్), స్టంట్స్ః సతీష్, నుంగ్, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫర్ః విష్ణుదేవా, ఎడిటర్ః ధర్మేంద్ర కాకరాల, రచనః ప్రవీణ్ సత్తారు, నిరంజన్ రామిరెడ్డి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః శ్రీచరణ్ పాకాల,
సమర్పణః శివాని శివాత్మిక ఫిలింస్, నిర్మాణంః జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్రఫీః అంజి, సురేష్ రగుతు, శ్యామ్ ప్రసాద్, గికా, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచరణ్ పాకాల, ప్రొడ్యూసర్ః ఎం.కోటేశ్వర్ రాజు, కథ, కథనం, దర్శకత్వంః ప్రవీణ్ సత్తారు.