కలెక్షన్స్‌తో దూసుకెళ్తోన్న గరుడవేగ...
Send us your feedback to audioarticles@vaarta.com
కమ్ బ్యాక్ మూవీ ఆఫ్ డా.రాజశేఖర్...సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్..సూపర్బ్ స్క్రిప్ట్..
'పిఎస్వి గరుడవేగ 126.18 ఎం' సినిమా గురించి వినపడుతున్న వార్తలు. సినీ ప్రేక్షకులే కాదు. సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు..ఇలా సినిమా చూసిన వారందరూ సినిమా అద్భుతంగా ఉందని అప్రిసియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మేన్‌గా తిరుగులేని విజయాలను సాధించిన డా.రాజశేఖర్‌కు పిఎస్వి గరుడవేగ సక్సెస్‌తో మంచి పేరొచ్చింది.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు టేకింగ్, అమోఘమైన స్క్రిప్ట్, అందుకు తగిన విధంగా డిజైన్ చేసిన పాత్రలు, ఆ పాత్రలకు తగ్గట్టు సరిపోయిన నటీనటులు..వీరందరిని పెర్ఫార్మెన్స్ను మరో లెవల్లో నిలబెట్టిన సాంకేతిక నిపుణులు. ఇవే గరుడవేగ సక్సెస్‌కు ప్రధాన కారణాలు.
జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ బేనర్‌పై ఎం.కోటేశ్వర్ రాజు నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్. నవంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. సినిమా విడుదలైన పది రోజులు 22 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com