ఉద్యోగినితో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ సరస సంభాషణ

  • IndiaGlitz, [Sunday,January 12 2020]

ఒకప్పుడు సినిమాల్లో వివాదాస్పదంగా నిలిచిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.. రాజకీయాల్లోకి వచ్చి పదవి పొందిన తర్వాత కూడా అదే పంథాను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు టీడీపీ నేతలపై.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నలుగురి నోళ్లలో నానారు. కాగా.. ఇటీవలే నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు, రైతు కూలీలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుండగా.. వారిని ఇష్టానుసారి మాట్లాడటం.. అటు టీడీపీ.. ఇటు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం.. అంతేకాదు.. వైసీపీ అధిష్టానం కూడా ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అయితే ఈ వివాదం ముగియక మునుపే పృథ్వీ మరో వివాదంలో చిక్కుకున్నాడు.

సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ ఓ ఉద్యోగినితో ఆయన జరుపుతున్న సరస సంభాషణ ఆడియో బయటికొచ్చింది. ఇప్పుడీ వ్యవహారం నెట్టింట్లో కలకలం రేపుతోంది. ఈ ఆడియో టేపులో చాలా అసభ్యంగా మాట్లాడుతున్నట్లు ఉంది. ఆ మహిళ ఎస్వీబీసీలోనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని అని తెలిసింది. అసలు నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆ ఆడియో టేపులో ఏముంది..? వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళ: సార్ హలో
పృథ్వీ: ఏంటమ్మా డిస్టర్బ్ చేశావ్. అదీ ఇదీ అంటున్నావ్?

మహిళ: పడుకున్నా అన్నాను సార్
పృథ్వీ: నోరు ముయ్.

పృథ్వీ: అన్నం తిన్నవా?
ఉద్యోగిని : ఇప్పుడే తిని పడుకున్నా

పృథ్వీ : రేపు డ్యూటీ ఉందా?
ఉద్యోగిని : రేపా? తెలీదు ఇంకా పొద్దున తెలుస్తుందేమో.

పృథ్వీ : అన్నం తినేటప్పుడు గుర్తుకురాలేదా?
ఉద్యోగిని : ఎవరు

పృథ్వీ : నేను..
ఉద్యోగిని : వచ్చారుగా. ఏం అలా అడిగారు. ఎందుకు?

పృథ్వీ : గుర్తుకొచ్చానా అంటున్నా?
మహిళ : మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు.

పృథ్వీ : ఇప్పుడు?
ఉద్యోగిని : ఇప్పుడు కూడా.

పృథ్వీ : పడుకునేటప్పుడు?
ఉద్యోగిని : సార్ నేను వర్షంలో తడుస్తూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు.

పృథ్వీ : ఔనా.. చెప్పుంటే నేను వచ్చి డ్రాప్ చేసేవాడినిగా?
ఉద్యోగిని : మీ గెస్ట్ హౌస్ నుంచే వచ్చా నేను. పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి.

పృథ్వీ : ఆగొచ్చు కదా?
ఉద్యోగిని : అందరూ ఉన్నారుగా.

పృథ్వీ : నేను డ్రింక్ చేయట్లేదురా వన్ ఇయర్ నుంచి. మార్చి వరకు తాగను.
ఉద్యోగిని : వాయిస్ అలా ఉంటే.. బాగా అలసి పోయారు కదా. డ్రింక్ చేశారేమో అనుకున్నా.

పృథ్వీ : డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చుని చేస్తా.
మహిళ : తప్పకుండా సార్.

పృథ్వీ : నీతో కూర్చుని కంపెనీ తీసుకుని చేస్తా.
ఉద్యోగిని : అలాగే సార్. తప్పకుండా. ఏం చెప్పారు సార్ మీటింగ్‌లో?

పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్.
ఉద్యోగిని : భలే చెప్తారు ఆ మాట మీరు.

పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్. హార్ట్ ఫుల్‌గా చెబుతున్నా.
ఉద్యోగిని : అదే సార్. ఆ మాట చెబుతున్నప్పుడల్లా ఒక సంతోషం వెలిగిపోతుంది నాకు.

పృథ్వీ : నువ్వంటే అంతిష్టం ఎందుకొచ్చిందో తెలీదు.
మహిళ : ఎందుకు సార్. ఎందుకొచ్చింది. ఏదో ఒక కారణం ఉంటుంది కదా?

పృథ్వీ : దేవుడా.. నేను కామెడీ చేయడం లేదు.
ఉద్యోగిని : నేను బయట చాలా సేపు నించున్నా. వస్తారేమో చూద్దామని

పృథ్వీ : వెనుక నుంచి వచ్చి పట్టుకుందామనుకున్నా. కెవ్వుమని అరుస్తావేమోనని భయపడి ఆగిపోయా.
మహిళ : ఎప్పుడు?

పృథ్వీ : మధ్యాహ్నం
ఉద్యోగిని : ఎక్కడ నుంచి

పృథ్వీ : మీ రూమ్ దగ్గరికి వద్దామనుకున్నా
మహిళ : ఆ... వచ్చేశారా కిందకి?

పృథ్వీ : వద్దామనుకున్నా. గట్టిగా పట్టుకున్నాననుకో... ఒక్క అరుపు అరిస్తే ఏం చెప్పాలి నేను?
ఉద్యోగిని : నేను అరవను కదా.

పృథ్వీ : ముందు అరుస్తావు కదా?
ఉద్యోగిని : ఎందుకు అరుస్తాను? అరవను కదా. మీరేవరో నాకు తెలీదు... నాతో మాట్లాడట్లేదంటే అరుస్తా.

పృథ్వీ : సరే అయితే చెప్పు
ఉద్యోగిని : ఏం చెప్పారు సార్ మీటంగ్‌లో అది చెప్పండి.

పృథ్వీ : చెబుతా 2 నిమిషాలు. కాఫీ తాగి చెబుతా..
పృథ్వీ : హలో ఓకే నీ ఇష్టం
మహిళ : సార్ అంత కోపంగా చెప్పకండి సార్. ప్లీజ్.

కాగా.. ఇంతవరకూ ఈ వ్యవహారంపై పృథ్వీ స్పందించిన దాఖలాల్లేవ్. మరి రియాక్ట్ అయితే పరిస్థితేంటనేది తెలుస్తుంది.

More News

ఎన్నికల ముందు టీఆర్ఎస్‌కు ఊహించని షాక్..!?

కరీంనగర్: ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ వరుస షాక్‌లు తగులుతున్నాయ్. ఓ వైపు టికెట్ల కోసం అభ్యర్థులు గొడవ..

రవితేజకు కథను వినిపించడానికి రెడీ అవుతున్న మారుతి!

‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఇచ్చిన కిక్కులో డైరెక్టర్ మారుతి ఉన్నారు. సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ చిత్రంగా

థమన్‌కు ఛాన్సులే ఛాన్సులు..

ఒక‌ప్పుడు థ‌మ‌న్ పేరు చెబితే సంగీత ప్రియులంద‌రూ పెద‌వి విరిచేవారు. అయితే ఇప్పుడు థ‌మ‌న్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తుండ‌టం విశేషం.

త్రివిక్రమ్ నాకు కొత్త బలాన్నిచ్చారు: అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ గా అభిమానుల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం పొందిన అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'అల.. వైకుంఠపురములో'.

వాళ్ల సినిమాలు చూడొద్దు.. మానేయండి: అశ్వనీదత్

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నెలకొన్న ఆందోళనలపై తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు.