గాజువాకలో గెలుపెవరిదో తేల్చేసిన పృథ్వీ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని అధినేతలు వేచి చూస్తున్నారు. పార్టీ అధినేతల కంటే రెట్టింపు టెన్షన్లో అటు అభిమానులు.. ఇటు పార్టీల నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ, జనసేన నేతలు ఎవరికి తోచిన విధంగా వాళ్లు తమకు అన్ని సీట్లొస్తాయ్..? ఇన్ని సీట్లొస్తాయ్..? గెలిచేది మేమే.. ప్రభుత్వాన్ని రాబోతోంది మేమే..? అంతేకాదు ఇప్పటికే ఓ పార్టీ మంత్రి పదవులను సైతం పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పృథ్వీ మాత్రం జనసేన అధినేత పవన్ పోటీ చేసిన గాజువాకలో పరిస్థితిపై జోస్యం చెబుతున్నారు. అసలు ఆయన ఏమంటున్నారో..? గాజువాక గెలిచినిలిచేది ఏ పార్టీనో.. జెండా ఎగిరేది ఏ పార్టీదో పృథ్వీ మాటల్లోనే విందాం.
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్..!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు నియోజకవర్గాల్లోనూ జనసేననే గెలుస్తుందని పార్టీనేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే మరికొందరు అభిమానులు భీమవరం నియోజకవర్గంలో పవన్ గెలుపు ఏమో కానీ గాజువాకలో మాత్రం తిరుగులేకుండా గెలుస్తారని పవన్ అభిమానులు కొందరు చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో పృథ్వీ సడన్‌గా బాంబులాంటి వార్త చెప్పారు. ఓ యూ ట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ముసుగు తొలగడంతో ఓట్లు మాకే పడ్డాయ్!!
" గాజువాకలో జనసేన లెక్కలు తారుమారవుతాయి. పవన్- చంద్రబాబుల మధ్య ఉన్న రహస్య సంబంధం ఇది వరకే చాలా సార్లు.. కొన్ని కొన్ని విషయాల్లో నిరూపితమయ్యింది. అందుకే గాజువాకలో కూడా వైసీపీకి ప్లస్ అయ్యింది. నేను ఎన్నికల అనంతరం అక్కడ పరిస్థితిని విశ్లేషణ చెయ్యగా అక్కడ టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.. ఆ పార్టీ శ్రేణులు అంతా జనసేనకు ఓటెయ్యమని వారి యువతకు చెప్పారని అది విన్న కార్యకర్తలు విస్మయానికి గురయ్యాం. ఇక వీరే ఇలా ముసుగు తీసాక వారికి ఓటెయ్యడం అనవసరం. వారికి ఓటేయడం మానేసి జనాలంతా వైసీపీ అభ్యర్థి అయినటువంటి తిప్పల నాగిరెడ్డికి ఓటేశారు. అంటే దీనిని బట్టి గాజువాకలో కూడా పవన్ గెలుపు విషయంలో ఊహించని ఫలితాలు వచ్చేందుకు అవకాశం లేకపోలేదు" అని పృథ్వీ చెప్పుకొచ్చారు. సో.. ఫైనల్‌గా గాజువాక పవన్‌దా..? లేకుంటే తిప్పల నాగిరెడ్డిదా..? అనేది తెలియాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments