ఆర్థిక సాయం చేసి కాపాడండి: నటుడు పొన్నంబళం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ సినిమాలతో పాటు ఇతర భాషల్లో నటించి బాగా ఫేమస్ అయిన ఓ నటుడు ప్రస్తుతం అనారోగ్యం బారిన పడి వైద్యానికి డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ నటుడు మరెవరో కాదు పొన్నంబళం. విలన్‌గా ఆయన తెలుగు ఆడియన్స్‌కు బాగా సుపరిచితులు. కొంతకాలం క్రితం పొన్నంబళం అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనకు కిడ్నీ ప్లాంటేషన్ నిర్వహించాల్సి ఉందని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఆయనను శస్త్ర చికిత్సకు సిద్ధం చేస్తున్నారు.
అయితే పొన్నంబళానికి అందుకు తగిన స్తోమత లేదు. దీంతో ఆయన సినీరంగంలోని సినీరంగంలోని ప్రముఖులను ఆర్ధిక సాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఐదేళ్లుగా తనకు ఆరోగ్యం సరిగా లేదని.. దీంతో జీవించేందుకు పోరాడాల్సి వస్తోందని పొన్నంబళం వెల్లడించారు. దీనిలో భాగంగానే తనకు వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సూచించారని.. తాను కూడా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమయ్యానని పొన్నంబళం తెలిపారు.
తన సోదరి కుమారుడు తనకు కిడ్నీ దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. అయితే ప్రస్తుతం తనకు ఎలాంటి ఆదాయమూ లేక తన కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని పొన్నంబళం తెలిపారు. ఇప్పటికే ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, ధనుష్, కె ఎస్ రవికుమార్, రాఘవ లారెన్స్, ఐసరి గణేష్ వంటి ప్రముఖులు ఆర్ధిక సహాయం చేశారని వెల్లడించారు. కాగా ప్రస్తుతం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సకు ఆర్థిక సాయం అవసరముందని, దాతలు, దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్ తరపున తగిన ఆర్ధిక సాయం అందించాలని పొన్నంబళం వేడుకొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com