సత్తా చాటిన రైతులు.. ఏకంగా సీఎం హెలీప్యాడ్‌నే...

  • IndiaGlitz, [Sunday,January 10 2021]

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కి అక్కడి రైతులు తమ సత్తా ఏంటో చూపించారు. పోలీసుల ఫిరంగులు, బాష్పవాయువును సైతం లెక్కచేయలేదు. సీఎం సభా ప్రాంగణాన్ని ధ్వంసం చేయడమే కాదు.. ఏకంగా సీఎం చేరుకోవాల్సిన హెలిప్యాడ్‌నే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో సీఎం తన పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు.

ఓవైపు వ్యవసాయ చట్టాలు రైతులకు చేటును.. కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఉన్నాయంటూ రైతులు ఆందోళన చేస్తుండగా.. మరోవైపు బీజేపీ మాత్రం ఆ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పేందుకు సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల కారణంగా కలిగే లాభాలను వివరించేందుకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ హరియాణాలోని కర్నల్ జిల్లాలోని కైమ్లాలో ‘కిసాన్ మహా పంచాయత్’ పేరిట ఆదివారం కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

సీఎం సభను ఎలాగైనా అడ్డుకునేందుకు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేతృత్వంలోని రైతులు ర్యాలీగా బయలుదేరి కైమ్లాకు చేరుకున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు జల ఫిరంగులు, భాష్పవాయువును ప్రయోగించారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. సభా ప్రాంగణానికి చేరుకుని కుర్చీలను, బల్లలను మొత్తం ధ్వంసం చేశారు. అలాగే సీఎం చేరుకోవాల్సిన హెలీప్యాడ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. రైతుల దాడి కారణంగా సీఎం పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చిందని బీజేపీ నేత రమణ్ మాలిక్ వెల్లడించారు.

More News

ఏపీలో కొత్త జిల్లాలకు రంగం సిద్ధం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై అధికారుల కమిటీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందినట్టు సమాచారం.

పాక్‌లో కల్లోలం.. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పవర్ కట్..

పాకిస్థాన్‌లో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇది కేవలం ఒక్క ఏరియాకు పరిమితమైతే పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు కానీ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పవర్ కట్ అయింది.

ఆకట్టుకుంటున్న‘లవ్ స్టోరీ’ టీజర్.. అంచనాలను భారీగా పెంచేశారు..

అందమైన లవ్ స్టోరీలను మరింత అందంగా సున్నితమైన భావోద్వేగాలను జత చేసి అందించడంలో దిట్ట శేఖర్ కమ్ముల.

అంరంగ వైభవంగా సింగర్ సునీత వివాహం..

ప్రముఖ గాయని సునీత వివాహం మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనితో అంగరంగ వైభవంగా జరిగింది.

16 నుంచి టీకా పంపిణీ ప్రారంభం..

భారతదేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌గా పేర్కొంటున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.