సత్తా చాటిన రైతులు.. ఏకంగా సీఎం హెలీప్యాడ్‌నే...
Send us your feedback to audioarticles@vaarta.com
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కి అక్కడి రైతులు తమ సత్తా ఏంటో చూపించారు. పోలీసుల ఫిరంగులు, బాష్పవాయువును సైతం లెక్కచేయలేదు. సీఎం సభా ప్రాంగణాన్ని ధ్వంసం చేయడమే కాదు.. ఏకంగా సీఎం చేరుకోవాల్సిన హెలిప్యాడ్నే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో సీఎం తన పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు.
ఓవైపు వ్యవసాయ చట్టాలు రైతులకు చేటును.. కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఉన్నాయంటూ రైతులు ఆందోళన చేస్తుండగా.. మరోవైపు బీజేపీ మాత్రం ఆ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పేందుకు సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల కారణంగా కలిగే లాభాలను వివరించేందుకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ హరియాణాలోని కర్నల్ జిల్లాలోని కైమ్లాలో ‘కిసాన్ మహా పంచాయత్’ పేరిట ఆదివారం కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
సీఎం సభను ఎలాగైనా అడ్డుకునేందుకు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేతృత్వంలోని రైతులు ర్యాలీగా బయలుదేరి కైమ్లాకు చేరుకున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు జల ఫిరంగులు, భాష్పవాయువును ప్రయోగించారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. సభా ప్రాంగణానికి చేరుకుని కుర్చీలను, బల్లలను మొత్తం ధ్వంసం చేశారు. అలాగే సీఎం చేరుకోవాల్సిన హెలీప్యాడ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. రైతుల దాడి కారణంగా సీఎం పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చిందని బీజేపీ నేత రమణ్ మాలిక్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com