కోనసీమ జిల్లా పేరు మార్పు : అమలాపురంలో హైటెన్షన్.. మంత్రి విశ్వరూప్, ఎంఎల్ఏ సతీశ్ ఇంటికి నిప్పు
Send us your feedback to audioarticles@vaarta.com
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు వద్దంటూ ఆ ప్రాంతవాసులు మంగళవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో కలెక్టరేట్ ముట్టడికి నిరసనకారులు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
ఈ క్రమంలో అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద పోలీసులపై ఆందోళనకారులు రాళ్లదాడికి దిగారు. ఆ సమయంలో అక్కడే వున్న జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి రాళ్లదాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. అయితే పట్టణంలోని నల్ల వంతెన వద్ద ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ దాడిలో పోలీసులు, యువకులకు గాయాలయ్యాయి. మరోవైపు కలెక్టరేట్ వైపు దూసుకెళ్తున్న నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా.. ఆ బస్సులను కొందరు అడ్డుకుని అద్దాలను ధ్వంసం చేశారు. ఈ మొత్తం ఘటనలో దాదాపు 20 మంది పోలీసులకు తలలు పగిలినట్లుగా తెలుస్తోంది. అమలాపురంలో ఆందోళనకారులను పోలీసులు వెంబడించి.. కొందరినీ అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటిని ముట్టడించి దాడి చేశారు. ఫర్నీచర్ , అద్దాలు ధ్వంసం చేసి ఇంటికి నిప్పంటించారు. దాడికి ముందే మంత్రి కుటుంబ సభ్యులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. మరోవైపు ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇంటిని సైతం ఆందోళనకారులు తగులబెట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమలాపురానికి మరిన్ని బలగాలు చేరుకుంటున్నాయి.
మరోవైపు ఈ అల్లర్లపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. బీఆర్ అంబేద్కర్ మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న,, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి దాయకమని.. అలాంటి మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com