క‌బాలి రిలీజ్ ఆపేందుకు ధ‌ర్నా..

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాలి. చాలా సార్లు రిలీజ్ డేట్ మార్చి ఆఖ‌రికి ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు. అయితే...తెలుగులో క‌బాలి రిలీజ్ కి అడ్డంకులు ఏర్ప‌డుతున్నాయి. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...ర‌జ‌నీకాంత్ న‌టించిన విక్ర‌మ‌సింహ‌ చిత్రాన్ని తెలుగులో ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి ఫిలింస్ సంస్థ రిలీజ్ చేసింది. విక్ర‌మ‌సింహ‌ చిత్రాన్ని ర‌జ‌నీ భార్య ల‌త‌ నిర్మించ‌గా ర‌జ‌నీ కుమార్తె సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ తెర‌కెక్కించారు.

అయితే...ఈ చిత్రం ద్వారా ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి సంస్థ‌కు దాదాపు 7 కోట్లు న‌ష్టం వ‌చ్చింది. దీంతో మాకు న్యాయం చేసే వ‌ర‌కు క‌బాలి చిత్రాన్ని రిలీజ్ చేయ‌డం కుద‌ర‌దు అంటూ ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. క‌బాలి తెలుగు వెర్షెన్ సెన్సార్ ఈరోజు పూర్తి చేసుకుంది. మ‌రి...ఈ స‌మ‌స్య ప‌రిష్కార‌మై క‌బాలి అనుకున్న టైమ్ కి రిలీజ్ అవుతుందో..? లేక విక్ర‌మ‌సింహా వివాదం వ‌ల‌న తెలుగులో క‌బాలి రిలీజ్ ఆగుతుందో చూడాలి.