ఏపీలో కొత్త జిల్లాలకు రంగం సిద్ధం..

  • IndiaGlitz, [Sunday,January 10 2021]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై అధికారుల కమిటీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందినట్టు సమాచారం. లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన 26 జిల్లాల ఏర్పాటును అధికారుల కమిటీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ డివిజన్ల విషయానికి వస్తే మొత్తం 57 డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందినట్టు సమాచారం. వీటిలో కొత్తగా 7 డివిజన్ల ఏర్పాటుకు అధికారుల కమిటీ ప్రతిపాదించగా.. 3 డివిజన్ల రద్దును సైతం సూచించినట్టు తెలుస్తోంది.

అలాగే అరకు లోక్‌సభ నియోజకవర్గంలో పార్వతీపురం, పాడేరు జిల్లాల ఏర్పాటును అధికారుల కమిటీ సూచించినట్టు సమాచారం. ఎన్నికలకు ముందు వైసీపీ తన మేనిఫెస్టోలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామని.. మొత్తంగా ఏపీలో 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా బదిలీలు చేపట్టకూడదని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు.

More News

పాక్‌లో కల్లోలం.. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పవర్ కట్..

పాకిస్థాన్‌లో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇది కేవలం ఒక్క ఏరియాకు పరిమితమైతే పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు కానీ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పవర్ కట్ అయింది.

ఆకట్టుకుంటున్న‘లవ్ స్టోరీ’ టీజర్.. అంచనాలను భారీగా పెంచేశారు..

అందమైన లవ్ స్టోరీలను మరింత అందంగా సున్నితమైన భావోద్వేగాలను జత చేసి అందించడంలో దిట్ట శేఖర్ కమ్ముల.

అంరంగ వైభవంగా సింగర్ సునీత వివాహం..

ప్రముఖ గాయని సునీత వివాహం మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనితో అంగరంగ వైభవంగా జరిగింది.

16 నుంచి టీకా పంపిణీ ప్రారంభం..

భారతదేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌గా పేర్కొంటున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

థియేటర్లలో 100% ఆక్యూపెన్సీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెస్ట్ బెంగాల్ సీఎం

సంక్రాంతి అంటే కోనసీమకే కాదు.. సినీ ఇండస్ట్రీకి వెలుగు తెస్తుంది.