'ప్రాజెక్ట్ C420' 80 శాతం షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
చైతన్య, దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా మహేష్ రెడ్డి దర్శకత్వంలో ఫిలిం N రీల్స్ బ్యానర్ పై రూపు దిద్దుకుంటున్న చిత్రం ప్రాజెక్ట్ C420 (వర్కింగ్ టైటిల్). సినిమా మొత్తం ఆస్ట్రేలియా లో షూటింగ్ జరుపుకుంటున్న మొట్ట మొదటి చిత్రమిది. ప్రస్తుతం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విశేషాలను చిత్ర దర్శకుడు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న మహేష్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రాజెక్ట్ C420 చిత్రం మొట్టమొదటిసారి ఆస్ట్రేలియాలో మొత్తం సినిమా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం. ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ ఎండింగ్ కి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. చైతన్య, దివి ప్రసన్నలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆస్ట్రేలియా, చైనాకి సంబంధించిన నటీనటులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి పనిచేస్తున్న 80 శాతం టెక్నిషియన్స్ ఆస్ట్రేలియా వారే.. అని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: రాబిన్ కె మార్క్స్, కెమెరా: సంతోష్ శనమొని, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, ప్రొడక్షన్ హౌస్: ఫిలిం N రీల్స్, దర్శకత్వం: మహేష్ రెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com