'ప్రొఫెసర్ ' ఫస్ట్ లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో ,విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్రకయినా సూట్ అయ్యే నటులు ఉంటారు. ఎలాంటి ఇమేజ్ లొ ఇరుక్కొకుండా , నటుడిగా ఆల్రౌండర్ అన్పించుకొవాలంటే ఎంతో తపన ఉండాలి. యువ నటుడు సూర్య తేజ్ ఇప్పుడు అదే పంథానే ఎంచుకున్నాడు. వినాయకుడు, శంభో శివ శంభో, ఫ్రెండ్స్ బుక్, అప్పుడలా- ఇప్పుడిలా ఇలా వేటికవే విభిన్న మైన చిత్రాలను ,పాత్రలను పోషించి మెప్పించిన సూర్య తేజ్ సెలెక్టెడ్ గా సినిమాలు చెస్తూ వస్తున్నాడు.
ప్రస్తుతం మేళా, ప్రొఫెసర్ సినిమాలతో ఈ ఏడాది ఒకెసారి రెండు సినిమాలతో రెండు భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తొన్న ఈ ఆల్రౌండర్ బర్త్ డే ఈ రోజు. ఈ సందర్బంగా ప్రొఫెసర్ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. సూర్య తేజ్, సెబా కౌష, దినేష్ ముఖ్య పాత్రల్లో క్రైమ్ థ్రిల్లర్ గా మనో వికాస్ దర్శకత్వంలొ ప్రకాష్ యాదవ్ పిఎస్పి ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి రచన: సెబా కౌషి, మనో వికాస్, సినిమాటోగ్రఫీ: కె.ఎ.స్వామి, కూర్పు : గౌతం నెరుసు, మాటలు : ప్రశాంత్ గొండ్లపల్లి, సంగీతం: శ్రావణ్ ఎస్. మిక్కీ, ఆర్ట్: రమేష్ దర, పాటలు: వాణి మాధవి అవసరాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చైతన్య వల్లూరు, నిర్మాత :ప్రకాష్ యాదవ్, దర్శకత్వం : మనో వికాస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments