close
Choose your channels

అది చూసి సీఎం కేసీఆర్ కూడా బాధపడాలి: నాగేశ్వర్

Thursday, April 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అది చూసి సీఎం కేసీఆర్ కూడా బాధపడాలి: నాగేశ్వర్

రెవెన్యూ శాఖలో అవినీతి ఉందంటే అది చూస్తున్న గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బాధపడాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. గురువారం నాడు నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెవెన్యూ శాఖలో సంస్కరణలపై రెవెన్యూ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉద్యోగులు, వివిధ రంగాల మేథావులు హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్.. కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతి నిర్మూలన అనేది రాజకీయ అవినీతి నుంచే ప్రారంభం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ అవినీతిని ముఖ్యమంత్రే అంతం చేయాలన్నారు.

ఉద్యోగులపై నెపం నెట్టే ప్రయత్నం సరికాదు..!

"కేసీఆర్ తిట్టకముందు రెవెన్యూ అధికారుల మీటింగ్ పెట్టి ఉంటే బాగుండేది. వ్యవస్థ మారనంత కాలం రాజకీయ నాయకులు అధికారులపై పెత్తనం చేస్తూనే ఉంటారు. ఉద్యోగుల పని సంస్కృతి మారక పోతే ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు మమ్మల్ని మేము సంస్కరించుకుంటాము అనే సందేశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అవినీతి రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు అవినీతి న్యాయవాది, పోలీసు, జర్నలిస్టు ఉంటాడు. మొత్తం వ్యవస్థను బలి చేస్తే.. ప్రభుత్వ మనుగడ కష్టం. ప్రజలకు, ఉద్యోగులకు ఘర్షణ వస్తే ప్రభుత్వానికి కష్టం. దేశంలో రాజకీయ అవినీతి అంతం కాకుండా ఉద్యోగుల అవినీతి నిర్ములన అసాధ్యం.

అవినీతి నిర్మూలన అనేది రాజకీయ అవినీతి నుంచే ప్రారంభం కావాలి. దాన్ని తొలగించకుండా ఉద్యోగులపై నెపం నెట్టే ప్రయత్నం సరికాదు. ఉద్యోగులపై దాడి మొదలైతే అది అక్కడితో ఆగదు.. ప్రభుత్వానికి మంచిది కాదు. వ్యవస్థ అవినీతిని సృష్టిస్తుందా? అవినీతిపరున్ని సృష్టిస్తుందా?.. అవినీతి ఆగాలంటే వ్యక్తిగత నిజాయితీ, వ్యక్తిగత హితబోధ జరగాలి. వ్యవస్థలు ఉద్యోగులను అవినీతి పరులను చేస్తాయి.ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చట్టాలు చేసే అధికారం ఉంటుంది. చట్టాన్ని ఉద్యోగులుగా మనం ప్రశ్నించలేము" అని ప్రొ. నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

 

 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment