‘రాధేశ్యామ్’ విడుద‌లపై నిర్మాత‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారా?

  • IndiaGlitz, [Sunday,December 27 2020]

రెబల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రంగా ‘స‌లార్‌’ షూటింగ్‌ను జ‌న‌వ‌రి 18 నుంచి స్టార్ట్ చేయ‌డానికి రెడీ అయ్యాడు. మ‌రి రాధేశ్యామ్ విడుద‌లపై నిర్మాత‌లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారో ఇప్ప‌టికీ వ‌ర‌కు ఎలాంటి ఊసూ లేదు. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు సినిమాను వ‌చ్చే ఏడాది జూన్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ప్యాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి అన్నీ భాష‌లకు సంబంధించిన డిస్ట్రిబ్యూట‌ర్స్‌తో డిస్క‌స్ చేసి నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. కాబ‌ట్టి జూన్ అయితే చ‌క్క‌గా ఉంటుంద‌ని అంద‌రూ అనుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌పై కూడా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

పీరియాడిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌కుడిగా కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ బ్యాన‌ర్స్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా వ‌చ్చే ఏడాది వేస‌విలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్‌ స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

విజయనిర్మల మనవడు శరణ్ - సినెటేరియా మీడియా వర్క్స్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది

పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ - అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విజయనిర్మల మనవడు శరణ్

ఆసుపత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్..

సూపర్‌స్టార్ రజినీకాంత్‌ ఆదివారం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. రజినీ ఆరోగ్య రీత్యా పలు సూచనలు చేసిన మీదట ఆయనను నేడు వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

ఆలియాపై కేసు నమోదు...

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆలియా భట్ 'గంగూబాయ్‌ కతియావాడి' అనే సినిమాలో నటిస్తోంది.

చందమామపై స్థలాన్ని కొని భార్యకు కానుకిచ్చాడు..

భార్యకు పెళ్లిరోజు కానుక ఏమివ్వాలా? అని ఓ భర్త ఆలోచించాడు. ఏముంటుంది.. ఏ బంగారు నెక్లెస్సో..

బిగ్‌బాస్ షోపై కేసు వేస్తా.. నాగార్జున క్షమాపణ చెప్పాలి: నారాయణ

టాలీవుడ్ సీనియర్ హీరో, బిగ్‌బాస్ వ్యాఖ్యత నాగార్జునపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.