హీరో సూర్యకు ప్రొడ్యూస‌ర్స్ స‌పోర్ట్

  • IndiaGlitz, [Monday,April 27 2020]

హీరో సూర్య సినిమాల్లో క‌థానాయ‌కుడిగా న‌టించ‌డ‌మే కాకుండా త‌న స్వంత బ్యాన‌ర్ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌పై భార్య జ్యోతిక స‌హా ఇత‌ర న‌టీన‌టుల‌తో చిన్న బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మిస్తుంటారు. ఈ కోవ‌లో సూర్య నిర్మాణంలో జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన చిత్రం ‘పొన్ మ‌గ‌ళ్ వందాల్‌’. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ.. క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. అయితే సూర్య ఈ సినిమాను డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ విష‌యం తెలియ‌డంతో థియేట‌ర్స్ సంఘం అధినేతలు సూర్య‌, జ్యోతిక సినిమాల‌ను బ్యాన్ చేయాల‌ని అనుకుంటున్నామ‌ని అన్నారు.

అయితే సూర్య‌కు నిర్మాత‌ల నుండి స‌పోర్ట్ ల‌భిస్తుంది. లో బ‌డ్జెట్ సినిమాలు.. విడుద‌ల ఆల‌స్య‌మైతే నిర్మాత‌ల‌కు చాలా స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఇలాంటి ప‌రిస్థితులు అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ వంటి డిజిట‌ల్ సంస్థ‌లు ముందుకు వ‌చ్చి సినిమాల‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌పోర్ట్ చేస్తున్నాయి. దీన్ని మ‌నం వ్య‌తిరేకించ‌కూడ‌దు. ఈ విష‌యంపై డిస్ట్రిబ్యూట‌ర్స్‌తో కూడా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని నిర్మాత‌లు తెలియ‌జేస్తున్నారు.