పూజా చెప్పిన పారితోషికానికి నిర్మాతలు షాక్!
Send us your feedback to audioarticles@vaarta.com
‘నాకు నేనే పోటీ.. నాకెవ్వరూ లేరు సాటీ, పోటీ’ అంటూ అందాల భామ పూజా హెగ్దే టాలీవుడ్‌లో దూసుకెళ్తోంది. వరుస సినిమాలు చేస్తూ, సూపర్ డూపర్ హిట్‌లు తన ఖాతాలో వేసుకుంటూ ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా ఉంది. అప్పుడెప్పుడో ‘ముకుంద’ సినిమాలో నటించిన పూజ.. ఇప్పటి ‘అల వైకుంఠపురములో’ మూవీకి పూజాలో చాలా మార్పులొచ్చాయ్. తనకు కథ నచ్చితే చాలా సీనియరా.. జూనియరా.. సూపర్‌స్టారా అనేది చూడకుండా నటించిస్తోందీ భామ. అలా అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ మహేశ్ బాబులతో ఇప్పటికే నటించేయగా.. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అఖిల్ సినిమాలు లైన్‌లో ఉన్నాయ్. అయితే ఈ రెండు సినిమాలు ఇంకా పూర్తి కాక మునుపే మరో బంపరాఫర్ వచ్చిందీ భామకు.
వరుస హిట్‌లు తన ఖాతాలో వేసుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ నటిస్తున్న ‘మేజర్’ మూవీలో మరోసారి అభిమానులను అలరించబోతున్నాడు. ముంబయి కాల్పుల్లో వీర మరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కుతుంది. కృష్ణన్ పాత్రలో శేష్ కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవర్నీ తీసుకుంటే బాగుంటుందని ఆలోచించిన చిత్రబృందం టాప్ హీరోయిన్ అయిన పూజా హెగ్దేను దర్శకనిర్మాతలు సంప్రదించారట. ఈ రెండు సినిమాలు త్వరలో అయిపోతాయని.. కచ్చితంగా నటిస్తానని చెప్పిందట. అయితే.. రెమ్యునరేషన్ గురించి ప్రస్తావన రాగా.. ఆమె ఒకటి.. ఒకటిన్నర.. రెండు కాదు.. ఏకంగా రెండున్నర కోట్లు అడిగేసిందట. దీంతో ఆ పారితోషికంకు కంగుతిన్న దర్శకనిర్మాతలు సారీ అమ్మా.. అంత పుచ్చుకోలేమని చెప్పి అక్కడ్నుంచి సైలెంట్‌గా వచ్చేశారట.
కాగా..‘అల వైకుంఠపురములో’ సినిమాకే రెండు కోట్లు పుచ్చుకున్న ఈ భామ.. ప్రభాస్ సినిమాకు ఇంకాస్త పెంచి రూ. 2.50 కోట్లు తీసుకుంటోందట. అందుకే ఇదే రెమ్యునరేషన్ ‘మేజర్’ అడిగిందట. ఆమె ఆ రేంజ్‌లో చెప్పడంతో మరో బ్యూటీని వెతికే పనిలో ‘మేజర్’ బృందం నిమగ్నమైందట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments