close
Choose your channels

రోబో సీక్వెల్‌పై నిర్మాత‌ల వివ‌ర‌ణ‌...

Saturday, July 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ రోబో ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెల‌సిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 2.0 రూపొందుతోంది. ఇప్ప‌టికే 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ నెగ‌టివ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం గ్రాఫిక్స్ వ‌ర్క్ జ‌రుగుతుంది.

అయితే ఆనారోగ్యం కార‌ణంగా ర‌జ‌నీకాంత్‌కు విదేశాల్లో శ‌స్త్ర చికిత్స జ‌రిగింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. దీని కార‌ణంగా రోబో సీక్వెల్ 2.0 చిత్రీక‌ర‌ణ ఆగిపోయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌కు బ్రేక్ వేస్తూ లైకా ప్రొడ‌క్ష‌న్స్ క్రియేటివ్ హెడ్ రాజు మ‌హాలింగం రోబో సీక్వెల్ కొత్త షెడ్యూల్ ఆగ‌స్టు నుండి స్టార్ట్ అవుతుంద‌ని అంటున్నారు. ఈ గ్యాప్‌లో శంక‌ర్ గ్రాఫిక్ వ‌ర్క్‌ను పూర్తి చేయిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.