కొవిడ్ బాధితులకు ‘రాధేశ్యామ్’ నిర్మాతల సాయం
Send us your feedback to audioarticles@vaarta.com
కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో కొవిడ్ బారిన పడుతుండటంతో అంతమందికి సరైన వైద్య సాయం అందించలేక ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి సపోర్ట్ చేయడానికి సినీ సెలబ్రిటీలు కొందరు ముందుకు వస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నిర్మాతలు తమ వంతుగా కొవిడ్ బాధితులకు సాయం అందించారు. రాధేశ్యామ్ సినిమాలో హాస్పిటల్ సీన్ కోసం తాము సిద్ధం చేసిన ఈ సెట్ ప్రాపర్టీని కొవిడ్ బాధితులకు విరాళంగా ఇచ్చారు.
కొవిడ్ బాధితులకు ‘రాధేశ్యామ్’ నిర్మాతలు విరాళంగా ఇచ్చిన వాటిలో 50 కస్టమ్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, స్ట్రెచర్స్, పీపీఈ కిట్స్ ఇతర మెడికల్ ఎక్యూప్మెంట్స్ ఉన్నాయి. ఈ 50 సెట్ ప్రాపర్టీలను 9 పెద్ద ట్రక్కుల ద్వారా హాస్పిటల్‌కు చేర్చారు. ఇలాగే సెలబ్రిటీలంతా ముందుకు వచ్చి ఏదో ఒక రూపంలో సాయం అందించాలని నెటిజన్లు కోరుతున్నారు. సెకండ్ వేవ్ ప్రారంభమయ్యాక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా ముందుకు వచ్చి సాయం చేసింది లేదు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక సినిమా విషయానికి వస్తే ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ పాన్ ఇండియా సినిమాను జూలై 30న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు సినిమా వాయిదా పడుతుందని అంటున్నారు. మరో వైపు సినిమాను థియేటర్స్, ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ చేసే అవకాశాలున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకూ చిత్ర యూనిట్ దీనిపై స్పందించలేదు. మరి ఓటీటీలో రిలీజ్ చేస్తారో లేదంటే థియేటర్లు తెరిచే వరకూ వెయిట్ చేస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout