డిజిట‌ల్ కోసం చేతులు క‌లుపుతున్న నిర్మాత‌లు

  • IndiaGlitz, [Friday,June 05 2020]

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న ప‌రిస్థితులు అంద‌రికీ తెలిసిందే. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. సినీ పెద్ద‌లు షూటింగ్స్‌ను స్టార్ట్ చేయ‌డానికి ప్ర‌యత్నాలు చేస్తున్నారు. థియేట‌ర్స్ లేని స‌మ‌యంలో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేసిన‌వి మాత్రం డిజిట‌ల్ మీడియా మాత్ర‌మే. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ వంటి భారీ డిజిట‌ల్ మీడియా సంస్థ‌లు కొన్ని సినిమాల‌ను థియేట‌ర్స్ కంటే త‌మ ఫ్లాట్‌ఫామ్ ద్వారా విడుద‌ల చేశాయి. సినిమాల‌కు ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌స్తుతం క‌న‌ప‌డుతున్న ఓటీటీ సంస్థ‌లు త‌మ ఉనికిని చాటు కోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి.

అల్లు అర‌వింద్ వంటి ప్ర‌ముఖ నిర్మాత తెలుగులో ఆహా అనే డిజిట‌ల్ మీడియా సంస్థ‌ను స్టార్ట్ చేశాడు. అందులో కంటెంట్‌ను పెంచేలా త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఈయ‌న బాట‌లో మ‌రికొంద‌రు నిర్మాత‌లు వెబ్ సంస్థ‌ల‌కు కంటెంట్‌ను అందించే దిశ‌గా ఆలోచ‌న‌లు చేస్తున్నార‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. డి.సురేష్‌బాబు, శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి, జెమినీ కిర‌ణ్ క‌లిసి వెబ్ కంటెంట్‌ను జ‌న‌రేట్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై ఈ ముగ్గురికీ ఓ క్లారిటీ రానుందట‌. కొన్ని రోజులు ఆగితే ఈ విష‌యానికి సంబంధించి మ‌రిన్ని విష‌యాలు తెలుస్తాయి.