థియేటర్లు తెరిచేందుకు చర్యలు చేపట్టిన ప్రొడ్యూసర్స్ గిల్డ్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి మూలంగా విపరీతంగా నష్టపోయిన పరిశ్రమలో చిత్ర పరిశ్రమ ఒకటి. ఇప్పటికీ థియేటర్లు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రభుత్వం సానుకూల వాతావరణం కల్పించినప్పటికీ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు సైతం ముందుకు రాకపోవడంతో థియేటర్లు నేటికీ తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలోనే థియేటర్లు మళ్లీ ప్రారంభించించేందుకు యాక్టివ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ అన్ని చర్యలూ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలకు భారం తగ్గేలా.. మల్టీప్లెక్స్ సంస్థలు పూనుకోవాలని గిల్డ్ కోరింది.
మల్టీప్లెక్స్ థియేటర్ల ముందు గిల్డ్ పెట్టిన ప్రతిపాదనలివే..
రెవెన్యూ షేరింగ్... ఇప్పటివరకు ఉన్న 55:45 (మొదటివారం), 45:55 (రెండో వారం), 40:60 (మూడో వారం), 35:65 (నాలుగో వారం) పద్దతిని పక్కన పెట్టి 60:40 (నిర్మాతలకు 60 శాతం), 50:50 (రెండో వారం), 40:60 (మూడో వారం)... పద్ధతిలో నిర్మాతలకు ఎక్కువ రెవెన్యూ వచ్చేలా ఉండాలి.
రెవెన్యూ షేరింగ్ ... తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఒకే తీరుగా ఉండాలి.
నిర్మాతల నుంచి ఇకపై వర్చువల్ ప్రింట్ ఫీ(వీపీఎఫ్) వసూల్ చెయ్యకూడదు.
థియేటర్లో వేసే సినిమా ట్రైలర్స్ కి డబ్బులు వసూల్ చెయ్యకూడదు. థియేటర్ ఆవరణలో పెట్టే పోస్టర్లు, ఇతర మెటీరియల్స్ కి రుసుము అడగొద్దు.
షో ప్రయారిటీ తెలుగు సినిమాలకే ఇవ్వాలి.
కాంబో టిక్కెట్లు అమ్మవద్దు
మెయింటెనెన్స్ ఛార్జీలు నిర్మాతల నుంచి తీసుకోవద్దు .
ప్రభుత్వం అధిక షోలకు అనుమతిస్తే... మల్టీప్లెక్స్‌లు పాటించాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments