ప్రభాస్ కోసం నిర్మాతలు ఏం చేస్తున్నారో తెలుసా!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం `సాహో`. `బాహుబలి` తర్వాత ప్రభాస్ సినిమాలపై పెరిగిన అంచనాలకు ధీటుగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పార్ట్ దాదాపు పూర్తయ్యింది. ఇప్పుడు ప్రభాస్ తన మరో సినిమా జాన్ చిత్రీకరణను ఇటలీలో స్టార్ట్ చేసేశాడు.
ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజున ప్రభాస్ అభిమాలను `సాహో` నిర్మాతలు పెద్ద గిఫ్ట్‌గా సినిమాలో దుబాయ్‌లో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేయబోతున్నారట. హాలీవుడ్ యాక్షన్ మాస్టర్స్ నేతృత్వంలో చేసిన ఈ ఫైట్‌కు దాదాపు 90 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు పెట్టారని సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇక మందిరా బేడి, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com