‘పుష్ప’ విష‌యంలో నిర్మాత‌లు క్లారిటీ!!

  • IndiaGlitz, [Thursday,June 18 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈపాటికి సినిమా సెట్స్‌పై ఉండేది. కానీ క‌రోనా దెబ్బ‌కు సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇస్తుంది. ఈ నేప‌థ్యంలో పుష్ప కోసం భారీ అడ‌వి సెట్ వేసి హైద‌రాబాద్ అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లోనే చిత్రీక‌రించాల‌ని అనుకున్నార‌ట‌. అయితే దీనిపై నిర్మాణ సంస్థ‌ల ప్ర‌తినిధులు అలాంటి వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని తేల్చేశార‌ట‌. క‌రోనా నుండి ప‌రిస్థితులు చ‌క్క బ‌డ్డ త‌ర్వాతే షూటింగ్స్ స్టార్ట్ చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.

ముందు కేర‌ళ‌లో షూటింగ్ చేయాల‌ని అనుకున్నారు. త‌ర్వాత మారేడు మిల్లి అడ‌వుల్లో షూటింగ్ చేయాల‌ని అనుకున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆంద్ర ప్రాంతంలోనే మారేడు మిల్లి అట‌వీ ప్రాంత‌లోనే చిత్రీక‌ర‌ణ బావుంటుంద‌ని నిర్మాత‌లు అనుకుంటున్నార‌ట‌. అందుక‌ని అక్క‌డ యూనిట్ ప్ర‌యాణానికి అనువుగా ఉండేలా రోడ్ల మ‌ర‌మ‌త్తులు చేయిస్తున్నార‌ట‌. రేపు షూటింగ్ ప్రారంభ‌మైన త‌ర్వాత ప్ర‌యాణాల‌కు సులువుగా ఉండాల‌ని ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని టాక్‌. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది.

More News

స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డుకు ఎంపికైన పలాష్ తనేజా

ఆపిల్ ప్రపంచ వ్యాప్త డెవలపర్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2020 స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డుకు 19 ఏళ్ల పలాష్ తనేజా ఎంపికయ్యాడు.

నా కూతురి ఆత్మహత్య కేసులో సల్మాన్ ప్రమేయం ఉంది: జియాఖాన్ తల్లి

బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యోదంతం పలు వివాదాలకు కారణమవుతోంది.

ఏపీలో 400 మార్క్‌ను దాటేసిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకూ 200 మార్క్ దాటని కరోనా కేసులు..

పూన‌మ్ సెన్సేషనల్ ట్వీట్స్.. టార్గెట్ ఎవరు?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో ద‌క్షిణాదిన కూడా ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి.

రీ రికార్డింగ్ దశలో యాక్షన్ అండ్ సోషియో థ్రిల్లర్ మూవీ  'క్లూ'

నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా సంక్షోభం ఏర్పడటంతో వందలాది చిత్రాల విడుదల  విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది.