‘పుష్ప’ విషయంలో నిర్మాతలు క్లారిటీ!!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. కరోనా ప్రభావం లేకుండా ఉండుంటే ఈపాటికి సినిమా సెట్స్‌పై ఉండేది. కానీ కరోనా దెబ్బకు సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. ఈ నేపథ్యంలో పుష్ప కోసం భారీ అడవి సెట్ వేసి హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లోనే చిత్రీకరించాలని అనుకున్నారట. అయితే దీనిపై నిర్మాణ సంస్థల ప్రతినిధులు అలాంటి వార్తలు అవాస్తవమని తేల్చేశారట. కరోనా నుండి పరిస్థితులు చక్క బడ్డ తర్వాతే షూటింగ్స్ స్టార్ట్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.
ముందు కేరళలో షూటింగ్ చేయాలని అనుకున్నారు. తర్వాత మారేడు మిల్లి అడవుల్లో షూటింగ్ చేయాలని అనుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంద్ర ప్రాంతంలోనే మారేడు మిల్లి అటవీ ప్రాంతలోనే చిత్రీకరణ బావుంటుందని నిర్మాతలు అనుకుంటున్నారట. అందుకని అక్కడ యూనిట్ ప్రయాణానికి అనువుగా ఉండేలా రోడ్ల మరమత్తులు చేయిస్తున్నారట. రేపు షూటింగ్ ప్రారంభమైన తర్వాత ప్రయాణాలకు సులువుగా ఉండాలని ఈ ప్రయత్నం చేస్తున్నారని టాక్. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com