నాగశౌర్య సినిమా ఆగిపోలేదు: నిర్మాతలు
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఓ సినిమా కొన్ని రోజుల ముందు స్టార్ట్ అయ్యింది. దాదాపు 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవల యు.ఎస్‌లో కొంత మేర చిత్రీకరణను పూర్తి చేసుకోవాల్సి ఉంది. అయితే రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ బడ్జెట్ ఎక్కువ అవుతుందనే కారణంతో ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా, నిర్మాత వివేక్ కూచిబొట్ల స్పందించారు.
``నాగశౌర్య సినిమా ఆగిపోలేదు. సోషల్ మీడియాలో సినిమా ఆగిపోయిందటూ వస్తున్న కథనాల్లో నిజం లేదు. ఇప్పటి వరకు సినిమా 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మిగిలి భాగాన్ని అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది. వీసాల కోసం వేచి చూస్తున్నాం. సినిమా ఇప్పటి వరకు చక్కగా వచ్చింది`` అన్నారు వివేక్ కూచిబొట్ల. అశ్వథ్థామ ఫ్లాప్ తర్వాత నాగశౌర్య తదుపరి సినిమాల ఎంపికలో జాగ్రత్తలు వహిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా ఈ యువ హీరో చేతిలో మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ సినిమాలపైనే నాగశౌర్య ఆశలను పెట్టుకున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments