వదంతులను నమ్మకండి..చిరు 152పై నిర్మాతల వివరణ
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ‘ఆచార్య’ పేరుతో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన వార్తొకటి సోషల్ మీడియాలో రీసెంట్‌గా తెగ హల్‌చల్ చేసింది. అదేంటంటే.. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ పరంగా రామ్‌చరణ్ డబ్బులు ఖర్చు పెట్టడని.. కానీ చిత్ర లాభాల్లో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుండి లాభాలను ఆశిస్తున్నారని ఆ వార్తల సారాంశం.
ఈ వార్తలపై మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకండి అంటూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రామ్‌చరణ్ తమతో సమానంగా నిర్మాణంలో పెట్టుబడులు పెడుతున్నారని, ఓ నిర్మాతలా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారని వారు తెలిపారు. చిరంజీవి 152వ సినిమాలో రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలోనూ నటిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. అలాగే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుందని టాక్. ప్రస్తుతం సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments