వ‌దంతుల‌ను న‌మ్మ‌కండి..చిరు 152పై నిర్మాత‌ల వివ‌ర‌ణ‌

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ‘ఆచార్య‌’ పేరుతో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ప‌తాకాల‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో రీసెంట్‌గా తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. అదేంటంటే.. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ ప‌రంగా రామ్‌చ‌ర‌ణ్ డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డ‌ని.. కానీ చిత్ర లాభాల్లో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నుండి లాభాల‌ను ఆశిస్తున్నార‌ని ఆ వార్త‌ల సారాంశం.

ఈ వార్త‌ల‌పై మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ స్పందించింది. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ‌దంతుల‌ను న‌మ్మ‌కండి అంటూ అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. రామ్‌చ‌ర‌ణ్ త‌మ‌తో స‌మానంగా నిర్మాణంలో పెట్టుబ‌డులు పెడుతున్నార‌ని, ఓ నిర్మాత‌లా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నార‌ని వారు తెలిపారు. చిరంజీవి 152వ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లోనూ న‌టిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అలాగే ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుందని టాక్‌. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆగిపోయింది.

More News

ఈ ల్యాబ్‌ను కరోనా టెస్ట్‌లకు వాడుకోండి..: మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో పలు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు మందు ఇదేనా..!?

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్ గానీ, చికిత్స గానీ ఇంత వరకూ అందుబాటులోకి రాలేదన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రయోగాలు మాత్రం ఇంకా ప్రపంచ దేశాలు చేస్తూనే ఉన్నాయి.

పోర్న్ సైట్‌లో బిగ్‌బాస్ బ్యూటీ ఫొటోలు

టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో దీన్ని పనికొచ్చే పనులకు కాకుండా.. ఏ మాత్రం ప్రయోజనం లేని పనులకు వాడే వారే ఎక్కువయ్యారు. ఎవరో ఒకర్ని టార్గెట్ చేయడం.. వారిని వేధించి సొమ్ము

మళ్లీ రిస్క్ చేస్తున్న రవితేజ ?

సాధారణంగా ఒక జోన‌ర్‌లో సినిమాలు చేసి.. అవి స‌క్సెస్ కాన‌ప్పుడు మన హీరోలు అలాంటి రిస్కులు చేయ‌డానికి ఆలోచిస్తారు. కానీ ర‌వితేజ అలాంటి ఆలోచ‌న‌లేవీ లేకుండా ఓకే చెప్పాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

నిర్భయ పేరెంట్స్‌కు సెల్యూట్ చేస్తున్నా.. న్యాయం జరిగింది!

దేశ రాజధాని ఢిల్లీలో పెను సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు అయ్యింది. ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో వాయిదాలు.. ఇంకెన్నీ పిటిషన్ల మధ్య ఎట్టకేలకు శుక్రవారం తెల్లారుజామున