బోయపాటి నిర్మాతలు మారారు

  • IndiaGlitz, [Tuesday,October 25 2016]

స్ట‌యిలిష్ స్టార్ అల్లుఅర్జున్‌తో స‌రైనోడు వంటి సెన్సేష‌న‌ల్ హిట్‌తో వంద‌కోట్ల డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను. ఈ స్టార్ డైరెక్ట‌ర్ ఇప్పుడు నిర్మాత బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాను నిర్మించ‌డానికి రంగం సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ అభిషేక్ పిక్చ‌ర్స్ ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని స‌మాచారం వ‌చ్చింది.

అయితే ఇప్పుడు లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాకు నిర్మాత‌లు మారారు. కార‌ణాలు తెలియ‌లేదు కానీ ఇప్పుడు ఈ సినిమాను అభిషేక్ పిక్చ‌ర్స్ వారు నిర్మించడం లేదట‌. నాగ‌చైత‌న్య‌తో సాహసం శ్వాస‌గా సాగిపో సినిమాను నిర్మించిన గురుఫిలింస్ అధినేత ఎం.ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మించ‌డానికి రెడీ అన్నార‌ట‌. ఈ సినిమాను న‌వంబ‌ర్ నుండి సెట్స్‌లోకి తీసుకెళ్ల‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

More News

క‌న్ ఫ్యూజ‌న్ లో ప్రేమ‌మ్ డైరెక్ట‌ర్ చందు..!

కార్తికేయ సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. తాజాగా అక్కినేని నాగ చైత‌న్య‌తో ప్రేమ‌మ్ చిత్రాన్ని తెర‌కెక్కించి వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.

సమస్యల్లో 'ఆక్సిజన్'....?

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్`. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

బోయపాటి శ్రీను చేతుల మీదుగా 'లెజెండ్' 1000 రోజుల పోస్టర్ విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం `లెజెండ్` ఇప్పుడు విజయవంతంగా 950 రోజులను పూర్తి చేసుకుని 1000 రోజుల దిశగా పయనిస్తుంది.

చిరు సినిమా శాటిలైట్ హ‌క్కులు

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ 150వ  చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం త‌మిళ హిట్ చిత్రం కత్తికి రీమేక్‌.

న‌వంబ‌ర్ 10న అనంత‌పురంలో ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ‌

న‌వంబ‌ర్ 10న అనంత‌పురంలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు స్పెష‌ల్ స్టేట‌స్ సాధ‌న కోసం ప్ర‌తి జిల్లాలో పోరాట స‌భ‌ను జ‌న‌సేన నిర్వ‌హిస్తుంద‌ని తిరుప‌తి బ‌హిరంగ స‌భ‌లో జ‌న‌సేన సేనాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.