ప్రియమణి 'సిరివెన్నెల' ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన: చిత్ర నిర్మాతలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని... తనదైన విభిన్నమైన పాత్రలతో మెప్పించిన ప్రియమణి... తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో కూడా నటించి అభిమానుల్ని సంపాదించుకుంది. పెళ్లి చేసుకొని కొంత గ్యాప్ తీసుకొని... సిరివెన్నెల అనే తెలుగు చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ఆ తర్వాత చిక్ మంగుళూరులో షూట్ చేసిన పాటతో చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.
ఈ ఫస్ట్ లుక్ లో ప్రియమణి పవర్ ఫుల్ లేడీగా కనిపించింది. ఈ పోస్టర్ కు అటు ఇండస్ట్రీ నుంచి, సోషల్ మీడియా నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఏ ఎన్ బి కోర్డినేటర్స్, శాంతి టెలీఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ బోరా, ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్లాసిక్ టైటిల్ "సిరివెన్నెల" అనే పేరు పెట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ చిత్రంలో ప్రియమణితో పాటు... జూనియర్ మహానటిగా మంచిపేరు తెచ్చుకున్న సాయి తేజస్విని, బాహుబలి చిత్రంలో కిలి కిలి భాషతో భయంకరమైన విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... ప్రియమణి గారు చాలా కథలు విన్నప్పటికీ "సిరివెన్నెల" కథ బాగా నచ్చడం... పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకుంది. ప్రియమణికి పర్ ఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీగా సిరివెన్నెల ఉండనుంది. మా బ్యానర్ కు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిది. సిరివెన్నెల అనే టైటిల్ మా సినిమాకు పర్ ఫెక్ట్ యాప్ట్ టైటిల్.
టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుంచి ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిక్ మంగుళూరులో సాంగ్ షూటింగ్ ఫినిష్ చేశాం. దీంతో చిత్ర షూటింగ్ పూర్తయింది. ఇక ఇప్పుడు ప్రియమణి ఫస్ట్ లుక్ ని శివరాత్రి సందర్భంగా విడుదల చేశాం. ఈ ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments