కోర్టుకి వెళ్లయినా సినిమా విడుదల చేస్తాం - నిర్మాత వెంకట్‌

  • IndiaGlitz, [Saturday,February 02 2019]

బెనర్జీ, వెంకట్‌, ముమైతఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. వెంకట్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'దండుపాళ్యం' ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ 'దండుపాళ్యం-4'లో తమ జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ 'దండుపాళ్యం 4' రూపొందింది. ఇందులో ఏడుమంది గ్యాంగ్ కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు.

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ ‘‘సినిమా షూటింగ్‌, నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇటీవల సెన్సార్‌ అప్లై చేశాను. కంటెంట్‌ పరంగా సినిమాలో ఏదన్నా సమస్య ఉంటే ఆ సన్నివేశాన్ని, డైలాగ్‌ని తొలగించడం జరుగుతుంది.

నా సినిమా చూసిన సెన్సార్‌ బోర్డ్‌ ఆఫీసర్‌ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి.. లేదంటే రిజక్ట్‌ చేస్తానని చెప్పారు. సినిమాలో సమస్య ఏంటో చెప్పకుండా సినిమాను రిజెక్ట్‌ చేస్తాననడం మొదటిసారి చూశా. ఆ తర్వాత నేనీ సినిమా సెన్సార్‌ చెయ్యను. రివైజ్‌ కమిటీకి వెళ్లండన్నాడు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నా. రివైజ్‌ కమిటీనే కాదు.. ట్రిబ్యునల్ అదీ కాకపోతే.. కోర్టు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో సినిమా విడుదల చేస్తాం అనని తెలిపారు.

ఇంతకన్నా క్రైమ్‌ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని విజయవంతంగా ఆడి థియేటర్స్‌ నుచి కూడా వెళ్లిపోయాయి. మా సినిమాతో సెన్సార్‌ బోర్డ్‌కి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చిలో సినిమా విడదల చేస్తాం అని దర్శకుడు చెప్పారు. కన్నడలో దండుపాళ్యంలో నటించడం వల్ల అక్కడ మరో రెండు సినిమాల్లో అవకశం వచ్చిందని డి.ఎస్‌.రావు చెప్పారు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More News

ఫిబ్రవరి 14న ప్రియ వారియర్ 'లవర్స్ డే' రిలీజ్ 

వింక్ గర్ల్‌ ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ నటించిన 'లవర్స్ డే' చిత్రం ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న  రిలీజ్‌కు సిద్ధమైంది.

మా 'యమ్‌6' చిత్రం అందర్నీ అలరిస్తుంది - నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు

విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై విశ్వనాథ్‌ తన్నీరు నిర్మించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'యమ్‌6'.

ప్రసాద్ ఐమాక్స్‌‌ యాజమాన్యంపై జీఎస్టీ కమిషనరేట్ కన్నెర్ర!

2019 జనవరి 1 మంగళవారం నుంచి సినిమా టికెట్‌ ధరలు తగ్గించాలని జీఎస్టీ కమిషనరేట్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

'లేడీ సెంటిమెంట్‌' పవన్‌కు ప్లస్ అవుతుందా!?

జనసేనలో ఇంత వరకూ బూత్‌ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అమెరికాలో అరెస్టయిన విద్యార్థుల కోసం పవన్ పోరాటం!

అమెరికాలోని ఓ ఫేక్ యూనివర్శిటీలో తప్పుడు సర్టిఫికెట్ల ద్వారా అడ్మిషన్ పొందిన తెలుగు విద్యార్థులను యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.