విలన్ అవుతున్ననిర్మాత....
- IndiaGlitz, [Thursday,March 02 2017]
రజనీకాంత్‌తో లింగ, రవితేజ పవర్ చిత్రాలను నిర్మించిన నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్..కన్నడ సినిమాల్లో నటిస్తుంటాడు కూడా. కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో కూడా ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు రాక్‌లైన్ వెంకటేష్. ఇప్పుడు ఈ నిర్మాత జ్యోతిక, బాల కాంబినేషన్లో రానున్న 'నాచియార్' అనే చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడట. అయితే ఈ పాత్ర నెగటివ్ షేడ్‌తో ఉంటుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. జ్యోతికతో పాటు జి.వి.ప్రకాష్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ 'నాచియార్' సినిమాను హీరో సూర్యనే తన స్వంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్లో నిర్మించబోతున్నాడు.