'పూర్ణ' ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు నిర్మాత - దేవదాసు మోదుగు
Send us your feedback to audioarticles@vaarta.com
డిఎస్‌ఆర్‌వి మీడియా పతాకంపై పివిఆర్ పిక్చర్స్ అసోషియేషన్‌లో తెలంగాణ ముద్దుబిడ్డ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాందించడం, ఆ క్రమంలో ఆమె జీవిత చరిత్రను 'పూర్ణ'గా హిందీ, తెలుగులో చిత్రాన్ని రూపొందించడం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని విలేఖరులతో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో పూర్ణతో పాటు ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్, ఆనంద్, అతిధి, నిర్మాత దేవదాసు మోదుగు (డి.డి), పివిఆర్ ప్రతినిధి ఉదయ్ మొదలగు వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దేవదాసు మోదుగు (డి.డి) మాట్లాడుతూ.. 'తెలంగాణ ముద్దు బిడ్డ, గిరిజన పుత్రిక అయిన పూర్ణ, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. ఆమె జీవిత చరిత్రను 'పూర్ణ' అనే టైటిల్‌తో తెరకెక్కించడం జరిగింది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందించే అవకాశం దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు కల్పించిన పివిఆర్ పిక్చర్స్ వారికి, అలాగే ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ చిత్ర విడుదలకు ఎంతగానో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము..' అని అన్నారు.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ మాట్లాడుతూ.. 'ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన నా జీవిత చరిత్రను సినిమాగా తీయడం అంటే చాలా సంతోషించే విషయమే. ఈ కార్యక్రమంలో నాకు సహకరించి, నన్ను ఇంతటి దానిని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని..మరికొందరు మన దేశ, రాష్ట్ర కీర్తిని పెంచాలని కోరుకుంటున్నాను..'అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments