మోసపోయిన సురేష్ బాబు.. వ్యాక్సిన్ అంటూ బురిడీ కొట్టించిన కేటుగాడు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మోసానికి గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. షార్టేజి వల్ల కరోనా వాక్సిన్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసింది.
ఇదీ చదవండి: అన్నయ్య కాంగ్రెస్, పవన్ జనసేన.. ప్రకాష్ రాజ్ పై నాగబాబు కామెంట్స్!
దీనితో టాలీవుడ్ లో షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతున్నాయి. సురేష్ బాబు కూడా తాను నిర్మిస్తున్న చిత్రాలని తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన టీం మొత్తానికి వ్యాక్సిన్ వేయించాలని డిసైడ్ అయ్యారు. ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ లు లభించడం కష్టంగా మారింది.
దీనితో నాగార్జున రెడ్డి అనే వక్తి సురేష్ బాబుకు ఫోన్ చేశారు. తన వద్ద 500 డోసుల వ్యాక్సిన్ ఉన్నాయని సురేష్ బాబుని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన సురేష్ బాబు కోవిడ్ వ్యాక్సిన్ కొరకు ఆర్డర్ ఇచ్చాడు. దీనితో వీరిద్దరి మధ్య డీల్ కుదిరింది. అయితే ముందుగా తన భార్య ఖాతాలో రూ. లక్ష జమ చేయాలని నాగార్జున రెడ్డి సురేష్ బాబుని కోరారు.
దీనితో సురేష్ బాబు అతడి భార్య ఖాతాకు లక్ష బదిలీ చేశారు. వెంటనే నాగార్జున రెడ్డి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీనితో తాను మోసపోయానని సురేష్ బాబు గుర్తించారు. తన ప్రతినిధుల ద్వారా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సురేష్ బాబు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగార్జున రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
నాగార్జున రెడ్డిపై గతంలో కూడా అనేక చీటింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేటీఆర్ పీఏ అంటూ అనేక మోసాలకు పాల్పడ్డట్లు నాగార్జున రెడ్డి గురించి పోలీస్ రికార్డ్స్ లో ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com