ప్రతివాళ్ళ జీవితంలో జరిగే పోరాటమే మా 'పోరాటం' నిర్మాత శ్రీనివాస్ రావు
Send us your feedback to audioarticles@vaarta.com
K3 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ రావు నిర్మాతగా .. మహేంద్రన్,వినోద్ ,తను శెట్టి ,ఐశ్వర్య హీరో హీరోయిన్స్ గా తెలుగు,తమిళ్ కన్నడ బాషల్లో తెరకెక్కిన చిత్రం పోరాటం. ఈచిత్రం లో నాజార్ ప్రతేక పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమా కి సంబందిచి పాటలు విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మరియు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్ ప్రెసిడెంట్ శ్రీమతి కవిత,దర్శకుడు సముద్ర పాల్గొన్నారు,పాటల విడుదల అనంతరం ప్రతని రామకృష్ణ గౌడ్ బిగ్ సిడి ని ఆవిష్కరించి మొదటి సిడి ని కవితకు మలి సిడి ని సముద్ర కు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా రామక్రిష్ణ గౌడ్ మాట్లాడుతూ ... ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను ఒకే లాంగ్వేజ్ లో చేయడం కంటే రెండు మూడు లాంగ్వేజ్ లలో చేయటం నిర్మాతకు చేయడం శ్రేయష్కరం ఒకే లాంగ్వేజ్ చేసిన మూడు లాంగ్వేజ్ ల్లో చేసినా ఒకే బడ్జెట్ అవుతుంది కాబట్టి నిర్మాత సేఫ్ గా వుంటాడు .ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది తప్పని సరిగా హిట్ అవుతుంది కారణం ఏంటి అంటే ఇదే టైటిల్ తో సూపర్ స్టార్ క్రిష్ణ గారు సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈ పోరాటంలో నటించిన హీరోస్ కు మంచి బవిష్యతు వుండాలి కోరుకుంటున్నా.. పాటలు బాగున్నవి మంచి పబ్లిసిటీతో సినిమా రిలీజ్ చేయండి నా వంతు సహకారం తప్పకుండా వుంటుంది అన్నారు.
కవిత మాట్లాడుతూ ..ఈ సినిమా దర్శకుడు ప్రతాప్ మురళిలో ఒక తపన కనిపిస్తుంది. ఒక బర్నింగ్ పాయింట్ తో చేసిన ఏ సినిమా అయినా తప్పనిసరిగా విజయం సాదిస్తుంది అని ఈ పాటలు చూస్తేనే అర్థం అవుతుంది. సంగీత దర్శకుడు మహేష్ & సతీష్ మంచి సంగీతాని అందించారు.అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్బుతంగా వుంది యూనిట్ సభ్యులందరికీ అల్ ది బెస్ట్ అన్నారు.
సముద్ర మాట్లాడుతూ .. ఈ సినిమా లో ఒక హీరోగా నటించిన మహేంద్ర .. నేను దర్శకత్వం వహించిన సింహరాశి చిత్రం లో చిన్నప్పటి రాజశేకర్ గా నటించాడు. ఈ రోజు తనను హీరో గా చూస్తుంటే చాలా సంతోషంగా వుంది.పోరాటం టైటిల్ చూస్తుంటే మూడు బాషలలో తప్పకుండా విజయం సాదిస్తుందన్న నమ్మకం నాకు వుంది.. అన్నారు.
సంగీత దర్శకుడు హరీష్ మాట్లాడుతూ ... తెలుగులో మాకు ఇది మొదటి సినిమా. తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని తప్పకుండా ఆదరిస్తారు.. అవకాశం ఇచిన్న దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.
దర్శకుడు ప్రతాప్ మురళి మాట్లాడుతూ.. ఇద్దరు హీరోస్ కూడా విలేజ్ కుర్రాళ్ళుగా అద్బుతంగా నటించారు మూడు బాషల్లోను దర్శకత్వం వహించడానికి అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్.
హీరో మహేంద్ర మాట్లాడుతూ.. మంచి సినిమా చూడాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి సినిమా అవుతుంది.బాల నటుడిగా ఆదరించిన మీరు ఇప్పుడు కూడా నన్ను ఆదరిస్తారని ఆదరించాలని కోరుకుంటున్నాను
నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ... నిజంగా జరిగిన కథనే జరిగిన చోటనే తీయటం జరిగింది అసలు పోరాట ఎందుకు ఎవరిమధ్య జరిగిందో చాలా ఆసక్తి కరంగా వుంటుంది. దర్శకుడు చాలా అద్బుతంగా తెరకెక్కించాడు.మూడు లాంగ్వేజ్ లలో తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం .
లహరి మ్యూజిక్ ద్వారా పాటలు విదుదల అయిన ఈ కార్యక్రమానికి మునిరాజ్ ,తిరుపతిరెడ్డి ,సాగర్ ,శివకుమార్ ,పాల్గొన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com