వకీల్ సాబ్ ప్రూవ్ చేసింది.. అల్లు అరవింద్ ప్రోత్సాహంతో ముందుకు..
- IndiaGlitz, [Tuesday,July 06 2021]
ప్రముఖ పీఆర్వో, నిర్మాత శ్రీనివాస్ కుమార్(ఎస్కెఎన్) జూలై 7న తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు. అల్లు అర్జున్, రాంచరణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలకు పిఆర్వోగా పైచేసిన శ్రీనివాస్ కుమార్ ఆ తర్వాత 'ఈరోజుల్లో ' అనే చిత్రంతో నిర్మాతగా మారారు.
విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన టాక్సీవాలా చిత్రంతో నిర్మాతగా పెద్ద సక్సెస్ అందుకున్నారు శ్రీనివాస్ కుమార్. దర్శకుడు మారుతి తాను మంచి స్నేహితులం అని శ్రీనివాస్ కుమార్ అన్నారు. మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే ఇలా మారుతి ప్రతి చిత్రంలోను తాను నిర్మాతగానే, సహ నిర్మాతగానే అసోసియేట్ అయినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: శ్రీయ ప్రైవేట్ పార్ట్ పై ముద్దు పెట్టేసిన భర్త.. వీడియో వైరల్!
ప్రస్తుతం మారుతి గోపీచంద్ తో తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ చిత్రానికి కూడా తాను సహ నిర్మాతని అని అన్నారు. నేను, మారుతి, బన్నీవాసుగారు, యూవీవంశీగారు..మేం నలుగురం సినిమాల్లోకి రాకముందే మంచి మిత్రులం అని శ్రీనివాస్ కుమార్ అన్నారు. మా మధ్యన ఎలాటి విభేదాలు ఉండవని అన్నారు.
ప్రస్తుతం సినీరంగ పరిస్థితిపై కూడా శ్రీనివాస్ కుమార్ మాట్లాడారు. సినిమాని థియేటర్ లో చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ ఏ ఓటిటి సంస్థ ఇవ్వలేదని అన్నారు.కరోనా పాండమిక్ వల్ల ఆర్థిక ఇబ్బందులతో కొందరు నిర్మాతలు ఓటిటీని ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇది తప్పదు. కానీ థియేటర్ వ్యవస్థ బావుంటేనే సినిమారంగం బావుంటుంది అని శ్రీనివాస్ కుమార్ అన్నారు.
లాక్ డౌన్ తర్వాత కూడా థియేటర్స్ లో తెలుగు సినిమాలకు ఆదరణ లభించింది. అందుకు ప్రేక్షకులను ధన్యవాదాలు. సెకండ్ వేవ్ సమీపిస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ విడుదలై ఎలాంటి వసూళ్లు రాబట్టిందో అందరికి తెలిసిందే. క్రాక్, జాతిరత్నాలు లాంటి చిత్రాలు కూడా అద్భుత విజయం సాధించాయి. థర్డ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయితే సినిమాలకు అలాంటి ఆదరణే లభిస్తుందని అనుకుంటున్నా.
నిత్యావసర ధరలు ఎలా పెరుగుతున్నాయో అందరికి తెలుసు. పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీనితో సినిమా ఆపరేషన్ కాస్ట్ కూడా పెరుగుతోంది. కాబట్టే టికెట్ ధరలు కూడా పెరుగుతున్నాయి అని శ్రీనివాస్ కుమార్ అన్నారు.