ఇలియానాపై బ్యాన్.. విక్రమ్ సినిమాతో గొడవ, నిర్మాత షాకింగ్ కామెంట్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
సౌత్ చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపిన హీరోయిన్ ఇలియానా. పోకిరి చిత్రం తర్వాత నడుము సుందరిగా, కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. క్షణం కూడా తీరికలేకుండా టాలీవుడ్ లో సినిమాలు చేసింది ఇలియానా. అంతటి బిజీ హీరోయిన్ ఒక్కసారిగా సౌత్ కి దూరమైంది. ఆ టైంలో ఆమె బాలీవుడ్ ఆఫర్స్ కోసం వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు.
కానీ అసలు సంగతి వేరని ప్రముఖ నిర్మాత కాంట్రగడ్డ ప్రసాద్ అంటున్నారు. కాంట్రగడ్డ ప్రసాద్ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో కీలక స్థానంలో ఉన్నారు. ఆయన ఇలియానా గురించి సంచలన విషయాలు రివీల్ చేశారు. తమిళ నిర్మాతతో జరిగిన ఓ గొడవ వల్లే ఆమె సౌత్ చిత్రాలకు దూరమైందని అన్నారు. ఇలియానా 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో నటిస్తున్న టైంలో నటరాజు అనే తమిళ నిర్మాత ఆమెని కలిశారట.
హీరో విక్రమ్ తో 'నందం' అనే మూవీ తీస్తున్నానని అందులో హీరోయిన్ గా నటించాలని కోరాడట. ఈ చిత్రాన్ని ఇలియానా అంగీకరించడం, రూ 40 లక్షలు అడ్వాన్స్ తీసుకోవడం జరిగిపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. సినిమా ఆగిపోయింది కాబట్టి తన అడ్వాన్స్ తిరిగివ్వాలని నిర్మాత ఇలియానాని కోరాడు. అందుకు ఇలియానా అంగీకరించలేదట.
ఇలియానా, నటరాజు మధ్య వాగ్వాదం కూడా జరిగిందట. దీనితో నటరాజు తమిళ నిర్మాతల మండలిని సంప్రదించారు. అక్కడ సమస్యకు పరిష్కారం దొరకలేదు. దీనితో నటరాజు సౌత్ ఫిలిం ఛాంబర్ కు వెళ్లారు. అక్కడ కూడా ఇలియానా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేందుకు నో చెప్పింది. దీనితో ఆమెపై అఫీషియల్ గా బ్యాన్ విధించలేదు కానీ.. ఇకపై సౌత్ చిత్రాలకు ఆమెని తీసుకోకూడదు అని డెసిషన్ తీసుకున్నట్లు కాంట్రగడ్డ ప్రసాద్ తెలిపారు.
దేవుడు చేసిన మనుషులు చిత్రం తర్వాత ఇలియానా దాదాపు 6 ఏళ్ల పాటు సౌత్ చిత్రాలకు దూరమైంది. తిరిగి 2018లో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com