కరోనా తర్వాత సినిమా సీన్ మారుతుంది!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న కష్టకాలంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న విషయం విదితమే. ఇప్పటికే మూడు లాక్ డౌన్‌లు పూర్తవ్వగా.. 4.0 మే-18 నుంచి మే-31వరకు ఉండనుంది. ఈ క్రమంలో కొన్ని సడలింపులను కేంద్రం ఇవ్వగా.. మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలకే చాయిస్ ఇచ్చింది. ఇక అసలు విషయానికొస్తే.. సినిమా షూటింగ్స్, రిలీజ్, థియేటర్స్ బంద్ అయ్యి సుమారు రెండు నెలలు దాటిపోయింది. ఇంతవరకూ ఓపెనింగ్స్ లేవ్. అందరికంటే ముందుగానే.. ప్రభుత్వం కూడా ప్రకటించక మునుపే టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు.. థియేటర్స్‌ను బంద్ చేసింది. అయితే కరోనా కష్టకాలం తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. ఈ తరుణంలో ‘బాహుబలి’ మూవీ నిర్మాత శోభు యార్లగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అసలేమన్నారు!?
ఆఫ్టర్ కరోనా పరిస్థితి ఇలా ఉంటుందని శోభు ఊహించారు.. కాదు కాదు ఇదే నిజమని ఆయన చెబుతున్నారు. ‘కరోనా తర్వాత సినీ పరిశ్రమ గతంలో మాదిరి ఉండబోదు. ముఖ్యంగా ఆడియో లాంచ్‌లు, ప్రీరిలీజ్, సక్సెస్ ఫంక్షన్స్ వంటివి ఉండవు. ప్రమోషన్ల కోసం రోడ్ ట్రిప్‌లు, మాల్స్‌కు వెళ్లడం వంటివి ఉండవు. ముఖ్యంగా థియేటర్స్‌కు వెళ్లడం వంటివి అసలే ఉండవు. అందరూ ఆన్‌లైన్‌కే పరమితం అవుతారు. మున్ముంథు అంతా ఆన్ లైన్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే జరుగుతుంది’ అని తన మనసులోని మాటను యార్లగడ్డ బయటపెట్టారు. అంటే మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే ‘కరోనా తర్వాత సినిమా సీన్ మారుతుంది’ ఇలా విడదీసి మరీ చెప్పారన్న మాట.
వ్యూహాలు రచించేస్తున్నారు..!
కాగా.. శోభు నిర్మించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఏప్రిల్ 17నే రిలీజ్ కానుండగా.. కరోనా దెబ్బతో పోస్ట్ పోన్ అయ్యింది. ఓటీటీలో రిలీజ్ చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలువురు ప్రముఖు కరోనా తర్వాత పరిస్థితులను ఊహించి సోషల్ మీడియా, మీడియా, ఇంటర్వ్యూల ద్వారా పంచుకున్న విషయం విదితమే. అంతేకాదు.. కరోనా తర్వాత జనాలను థియేటర్లకు ఎలా రప్పించాలి..? ఎలా అయితే జనాలు వస్తారు..? అనేదానిపై థియేటర్స్ యాజమాన్యాలు, దర్శకనిర్మాతలు వ్యూహాలు రచిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments