నిర్మాతకు జీవిత ఖైదు...
- IndiaGlitz, [Wednesday,May 24 2017]
సమరసింహారెడ్డి, నరసింహుడు చిత్రాల నిర్మాత చెంగల వెంకట్రావుకు అనకాపల్లి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విదించింది. పదేళ్ళ క్రితం నక్కపల్లి మండలంలో బంగారమ్మ పేటలో బి.ఎం.సి కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన గొడవల్లో గోసల కొండ అనే మత్య్సకారుడు చనిపోయాడు. కొండ మృతికి ఎమ్మెల్యే, అతని అనుచరులే కారణమని కేసు నమోదైంది.
వెంకట్రావు సహా మరో 15 మందికి జీవిత ఖైదు, మరో 5 ఐదు మందికి రెండేళ్ళ జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది.గతంలో బాలకృష్ణతో సమరసింహారెడ్డి సినిమా తీసి సూపర్‌డూపర్ హిట్ కొట్టిన చెంగల వెంకట్రావు, ఎన్టీఆర్ నరసింహుడు చిత్రంతో అప్పుల పాలై అత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. టి.డి.పిలో చేరిన చెంగల వెంకట్రావు 1999, 2004లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు. 2012లో వైఎస్ఆర్ పార్టీలో చేరిన ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు