మోహన్ లాల్ హ్యాపీ అంటున్న నిర్మాత

  • IndiaGlitz, [Saturday,December 03 2016]

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ న‌టించిన 'పులి మురుగ‌న్' చిత్రం మ‌లయాళంలో వంద కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ ను సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో సింధూర పువ్వు, సాహ‌స‌ఘ‌ట్టం వంటి చిత్రాల‌ను అందించిన నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి మ‌న్యం పులి పేరుతో తెలుగులో డిసెంబ‌ర్ 2న విడుద‌ల చేశారు. ఈ సినిమా తొలిరోజున హిట్ టాక్‌ను సొంతం చేసుకుని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంద‌ని నిర్మాత సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి తెలియ‌జేశారు.

శ‌నివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో సింధూర పువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ...మ‌న్యంపులి సినిమా ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ లో మంచి ఆద‌ర‌ణ పొందుతుంది. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కులు సినిమా ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉందంటున్నారు. బాహుబ‌లి త‌ర్వాత ఓ మంచి సినిమా చూశామంటున్నారు. ఇక మోహ‌న్‌లాల్‌గారి న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అన్నీ ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా ప‌లికించారు. మాస్‌, యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ అన్నింటిలో అద్భుతంగా న‌టించారు. రీసెంట్‌గా సినిమాను చూసిన వెంకేష్‌, సురేష్‌బాబు, మ‌హేష్‌బాబు సినిమా చూసి బావుందన్నారు. మ‌నం కూడా హాలీవుడ్ సినిమాలు తీయ‌వచ్చున‌ని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఆదివారం, సోమ‌వారం క‌లెక్ష‌న్స్ పెరుగుతాయ‌నుకుంటున్నామ‌ని అన్నారు.

More News

వంగ‌వీటి రాధాతో రామ్ గోపాల్ వ‌ర్మ భేటి

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వంగ‌వీటి అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ను అఖిల్ క‌ల‌వ‌డానికి కార‌ణం..?

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ హృతిక్ రోష‌న్ ను అక్కినేని అఖిల్ ముంబాయిలో కలిసారు. వైజాగ్ లో అఖిల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ప్రారంభించిన అనంతరం ముంబాయి వెళ్లారు.

డి.జె షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన బన్ని..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ డి.జె దువ్వాడ జగన్నాథమ్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

'రెమో' సక్సెస్ తో దిల్ రాజు గారు మంచి వేదిక నిచ్చారు - హీరో శివ కార్తీకేయన్

శివకార్తీకేయన్ వేసిన లేడీ గెటప్ చాలా బావుందని అందరూ అంటున్నారు. నేను సినిమా తప్పకుండా తెలుగులో పెద్ద సక్సెస్ అవుతుందని తొలిరోజు ప్రెస్మీట్లోనే నేను చెప్పాను...అదీ రోజు నిజమందని అన్నారు నిర్మాత దిల్రాజు.

ఒకరోజు ముందుగానే 'బలం' చూపించ బోతున్న హృతిక్ రోషన్

బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ "కాబిల్" . ఈ చిత్రాన్ని తెలుగులో బలం అనే పేరుతో విడుదల చేస్తున్నారు.